Loading...
Form 7: ఓటర్ల జాబితాలో పేర్ల తొలగింపునకు ఫారం 7.. ఎప్పుడు దాఖలు చేయాలి?
ఓటర్ల జాబితాలో పేర్ల తొలగింపునకు ఫారం 7.. ఎప్పుడు దాఖలు చేయాలి?

Form 7: ఓటర్ల జాబితాలో పేర్ల తొలగింపునకు ఫారం 7.. ఎప్పుడు దాఖలు చేయాలి?

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 25, 2026
12:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటర్ల జాబితాకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా సాగాలంటే ఓటర్ల జాబితా కూడా కచ్చితంగా ఉండాలి. అనర్హులు ఓటర్లుగా నమోదుకాకుండా చూడటంతోపాటు.. ఇప్పటికే జాబితాలో ఉన్న అనర్హుల పేర్లను తొలగించేందుకు ఎన్నికల సంఘం (ఈసీఐ) పలు నిబంధనలు, విధానాలను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా పౌరులకు అందుబాటులో ఉన్న ముఖ్యమైన మార్గాల్లో 'ఫారం 7' ఒకటి. ఓటర్ల జాబితాలోని ఓ వ్యక్తి పేరుపై అభ్యంతరం వ్యక్తం చేయడానికి లేదా నిర్దిష్ట కారణాలతో పేరు తొలగించాలని కోరేందుకు ఈ ఫారాన్ని ఉపయోగించవచ్చు.

వివరాలు 

ఫారం 7 అంటే ఏమిటి?

రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టర్స్ రూల్స్, 1960 ప్రకారం ఫారం 7ను రూపొందించారు.

ఓటరుగా కొత్తగా నమోదు చేసుకోవడానికి ఫారం 6ను, ఇప్పటికే ఉన్న ఓటరు వివరాల్లో మార్పులు చేసేందుకు ఫారం 8ను ఉపయోగిస్తారు.

అదే విధంగా ఓటర్ల జాబితాలోని పేరుపై అభ్యంతరం చెప్పడం లేదా నిర్దిష్ట కారణాలతో పేరు తొలగించాలని కోరడం కోసం ఫారం 7ను వినియోగిస్తారు.

ఈ సందర్భాల్లో ఫారం 7 ఉపయోగించొచ్చు..

కింది పరిస్థితుల్లో ఓటర్ల జాబితాలోని పేరుపై అభ్యంతరం లేదా తొలగింపు కోసం ఫారం 7ను దాఖలు చేయవచ్చు. ఓటరు మరణించిన సందర్భంలో. ఓటరు శాశ్వతంగా మరో ప్రాంతానికి నివాసం మార్చినప్పుడు. ఒకే వ్యక్తి పేరు రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఓటరుగా నమోదైనప్పుడు.

వివరాలు 

ఎవరు ఫారం 7 దాఖలు చేయొచ్చు?

ఓటర్ల జాబితాలో నమోదైన వ్యక్తి భారత పౌరుడు కానప్పుడు. 18 ఏళ్లు నిండకముందే ఓటరుగా నమోదు చేసినట్లు గుర్తించినప్పుడు. ఒక వ్యక్తి తన పేరును ఓటర్ల జాబితా నుంచి స్వయంగా తొలగించుకోవాలనుకున్నప్పుడు.

ఒక నియోజకవర్గంలోని ఓటర్ల జాబితాలో నమోదైన ఓటరు.. అదే జాబితాలోని మరో వ్యక్తి పేరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఫారం 7ను సమర్పించవచ్చు.

ఇందుకోసం దరఖాస్తుదారు తన పూర్తి వివరాలను అందించాలి. ఇందులో పేరు,ఓటరు గుర్తింపు కార్డు నంబర్,చిరునామా,ఫోన్ నంబర్ వంటి వివరాలు ఉంటాయి.

అదే సమయంలో ఎవరి పేరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారో వారి వివరాలను కూడా పేర్కొనాలి.

ఆ వ్యక్తి పేరు తొలగించాలని కోరడానికి గల కారణాన్ని స్పష్టంగా నమోదు చేయాలి.

ADVERTISEMENT

వివరాలు 

ఆన్‌లైన్‌లో.. ఆఫ్‌లైన్‌లోనూ దరఖాస్తు

కారణం సరైనదిగా, వాస్తవాల ఆధారంగా ఉండటం కీలకం.

ఫారం 7ను ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో దాఖలు చేసే అవకాశం ఉంది.

ఎన్నికల సంఘం అధికారిక ఓటర్ సర్వీస్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయవచ్చు.

ప్రత్యామ్నాయంగా సంబంధిత బూత్ లెవల్ ఆఫీసర్ (బీఎల్ఓ) వద్ద ఆఫ్‌లైన్‌లోనూ ఫారం సమర్పించవచ్చు.

దరఖాస్తు స్వీకరించిన తర్వాత దరఖాస్తుదారుకు రసీదు అందజేస్తారు.

ADVERTISEMENT

వివరాలు 

ఫారం 7 అందిన తర్వాత ఏం జరుగుతుంది?

దరఖాస్తు సమర్పించిన వెంటనే ఓటరు పేరు తొలగిపోదు. ఫారం 7లో చేసిన అభ్యంతరాన్ని ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ఈఆర్ఓ) పరిశీలిస్తారు.

ఎవరి పేరుపై ఫిర్యాదు లేదా అభ్యంతరం వచ్చిందో ఆ వ్యక్తికి నోటీసు ఇచ్చి, తన వివరణను అందించే అవకాశం కల్పిస్తారు.

అనంతరం అవసరమైతే క్షేత్రస్థాయి విచారణ చేపట్టాలని బూత్ లెవల్ ఆఫీసర్‌ను ఆదేశిస్తారు.

బీఎల్ఓ సంబంధిత అంశాలను పరిశీలించి, వాస్తవాలను నిర్ధారించిన తర్వాత తన నివేదికను ఈఆర్ఓకు సమర్పిస్తారు.

ఇరుపక్షాల వివరాలు, సంబంధిత ఆధారాలు, క్షేత్రస్థాయి విచారణ నివేదికను పరిశీలించిన తర్వాత ఈఆర్ఓ తుది నిర్ణయం తీసుకుంటారు.

పేరు తొలగించేందుకు సరైన కారణాలు ఉన్నాయని నిర్ధారణ అయినప్పుడే ఓటర్ల జాబితా నుంచి ఆ పేరును తొలగిస్తారు.

వివరాలు 

తప్పుడు ఫిర్యాదు చేస్తే చర్యలు తప్పవు

ఫారం 7ను వ్యక్తిగత లేదా రాజకీయ కక్ష సాధింపుల కోసం దుర్వినియోగం చేయడం చట్టపరమైన సమస్యలకు దారితీయవచ్చు.

వాస్తవాలు తెలియకుండానే లేదా ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారంతో అభ్యంతరం వ్యక్తం చేయడం నేరంగా పరిగణించబడుతుంది.

ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1950లోని సెక్షన్ 31 ప్రకారం ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రకటన చేసినట్లు రుజువైతే గరిష్ఠంగా ఏడాది వరకు జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది.

అందుకే ఫారం 7ను దాఖలు చేసే ముందు సంబంధిత సమాచారం వాస్తవమా కాదా అనేది నిర్ధారించుకోవాలి.

ఓటర్ల జాబితాలో తప్పులను గుర్తించి సరిచేయడంలో భాగంగా ఈ సదుపాయాన్ని బాధ్యతాయుతంగా వినియోగించాలని ఎన్నికల సంఘం సూచిస్తోంది.

ADVERTISEMENT