NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / 'చంద్రయాన్-3 మిషన్‌' విఫలమవుతుందని కన్నడ లెక్చరర్ పోస్టు; వివరణ కోరిన ప్రభుత్వం 
    తదుపరి వార్తా కథనం
    'చంద్రయాన్-3 మిషన్‌' విఫలమవుతుందని కన్నడ లెక్చరర్ పోస్టు; వివరణ కోరిన ప్రభుత్వం 
    'చంద్రయాన్-3 మిషన్‌' విఫలమవుతుందని కన్నడ లెక్చరర్ పోస్టు; వివరణ కోరిన యంత్రాగం

    'చంద్రయాన్-3 మిషన్‌' విఫలమవుతుందని కన్నడ లెక్చరర్ పోస్టు; వివరణ కోరిన ప్రభుత్వం 

    వ్రాసిన వారు Stalin
    Jul 19, 2023
    03:10 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    చంద్రయాన్-3 మిషన్‌ను అపహాస్యం చేస్తూ సోషల్ మీడియాలో ఓ కర్ణాటక లెక్చరర్ పోస్టులు పెట్టడం తీవ్ర దుమారాన్ని రేపింది.

    బెంగళూరులోని మల్లేశ్వరానికి చెందిన కన్నడ ప్రీ-యూనివర్శిటీ (పీయూ) కళాశాల లెక్చరర్ హులికుంటె మూర్తి ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 మిషన్ విఫలం అవుతుందని సోషల్ మీడయాలో పోస్టు పెట్టారు.

    జులై 14న చంద్రయాన్ 3 ప్రయోగానికి ముందు పూజలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి ఆలయాన్ని సందర్శించిన ఇస్రో శాస్త్రవేత్తలను ఉద్దేశించి అవహేళన చేస్తూ హులికుంటె మూర్తి పోస్టు పెట్టారు.

    కర్ణాటక ప్రీ-యూనివర్శిటీ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ ఈ విషయాన్ని గుర్తించింది. ప్రభుత్వం ఆేదేశాల మేరకు హులికుంటె మూర్తి నుంచి వివరణ కోరింది.

    ఇస్రో

    లెక్చరర్ హులికుంటె మూర్తి పోస్టుపై స్పందించిన పీయూ డిప్యూటీ డైరెక్టర్ 

    చంద్రయాన్-3పై మూర్తి పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ విషయం తన దృష్టికి వచ్చినట్లు పీయూ (బెంగళూరు నార్త్) డిప్యూటీ డైరెక్టర్ తెలిపారు.

    అతను ఎందుకు పోస్ట్ చేశాడనే దానిపై తాము వివరణ కోరినట్లు చెప్పారు. బుధవారంలోపు సమాధానం ఇవ్వాలని మూర్తికి నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. అతను చెప్పే సమాధానం ఆధారంగా చర్యలు తీసుకుంటామని డిప్యూటీ డైరెక్టర్ పేర్కొన్నారు.

    హులికుంటె మూర్తి పోస్టుపై అటు ప్రభుత్వంతో పాటు ప్రతిపక్షాలు కూడా తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి.

    మరోవైపు కర్ణాటక మాజీ విద్యాశాఖ మంత్రి, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకుడు ఎస్.సురేష్ కుమార్ లెక్చరర్ వ్యవహారంపై పాఠశాల విద్యాశాఖ మంత్రి మధు బంగారప్పకు లేఖ రాశారు. అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కర్ణాటక
    చంద్రయాన్-3
    ఇస్రో
    తాజా వార్తలు

    తాజా

    Stock Market: లాభాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ@24,600 స్టాక్ మార్కెట్
    Flood Situation: ఈశాన్యంలో ప్రకృతి ప్రళయం.. వరదల బీభత్సంతో 43 మంది మృతి వరదలు
    Cash Row: జస్టిస్‌ యశ్వంత్‌ వర్మపై అభిశంసనకు కేంద్రం రంగం సిద్ధం  కేంద్ర ప్రభుత్వం
    Andhra Pradesh: ఏపీలో నేషనల్ హైవే ఆరు లైన్లుగా.. కేంద్రం ముందుకు ప్రతిపాదనలు శ్రీకాకుళం

    కర్ణాటక

    కాంగ్రెస్: సిద్ధరామయ్య vs డీకే శివకుమార్‌; కర్ణాటక సీఎం ఎవరు?  కాంగ్రెస్
    కర్ణాటకలో కాంగ్రెస్ విజయంపై డీకే శివకుమార్ భావోద్వేగం కాంగ్రెస్
    కర్ణాటకలో బీజేపీ ఓటమిని అంగీకరించిన సీఎం బసవరాజ్ బొమ్మై  బసవరాజ్ బొమ్మై
    మిగతా రాష్ట్రాల్లోనూ కర్ణాటక ఫలితాలే పునరావృతం: రాహుల్ గాంధీ  రాహుల్ ద్రావిడ్

    చంద్రయాన్-3

    ఇస్రో: చంద్రయాన్ 3 మోసుకెళ్తున్న పరికరాలు ఏంటి? వాటి ఉపయోగాలు ఏంటి?  ఇస్రో
    చంద్రయాన్ 3: చంద్రుడి దక్షిణ ధృవంపై ఇస్రో ఎందుకు దృష్టి పెట్టింది?  ఇస్రో
    ఇస్రో: చంద్రుడిపై చంద్రయాన్ 3 ల్యాండే అయ్యేటపుడు ఎన్ని దశలుంటాయో తెలుసా?  ఇస్రో
    చంద్రయాన్ 3: ఈరోజు మద్యాహ్నం నింగిలోకి దూసుకెళ్ళనున్న రాకెట్  ఇస్రో

    ఇస్రో

    అరుదైన తోకచుక్క చిత్రాలను తీసిన చంద్ర టెలిస్కోప్ భారతదేశం
    ISRO: జోషిమఠ్‌ పట్టణంలో 12రోజుల్లో 5.4 సెం.మీ కుంగిన భూమి ఉత్తరాఖండ్
    విపత్తులు, వాతావరణ మార్పులను ట్రాక్ చేసే నాసా-ఇస్రో NISAR మిషన్ నాసా
    భారతదేశ వ్యోమగామి శిక్షణా కార్యక్రమానికి సహకరించనున్న IIT మద్రాస్-ఇస్రో భారతదేశం

    తాజా వార్తలు

    కాంగ్రెస్ కీలక ప్రకటన ; దిల్లీ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా నిర్ణయం    ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్
    ముంబై బీచ్‌లో ఘోరం; ఫొటోలు దిగుతుండగా అలలకు కొట్టుకుపోయిన మహిళ  ముంబై
    Duleep Trophy 2023: దులీప్ ట్రోఫీ టైటిల్ విజేత సౌత్ జోన్; వెస్ట్ జోన్‌పై విజయం  దులీప్ ట్రోఫీ
    టమాట కేజీ రూ.80కే అమ్ముతున్న కేంద్ర ప్రభుత్వం; ఎక్కడో తెలుసా? టమాట
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025