Village Defence Guards: రాజౌరిలో అనుమానాస్పద కదలికలు.. కాల్పులు జరిపిన గ్రామ రక్షణ గర్డ్స్
జమ్ముకశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో సోమవారం రాత్రి అనుమానాస్పద కదలికలను గుర్తించిన గ్రామ రక్షణ గార్డ్స్ (VDG) బృందం కాల్పులు జరిపింది. సోమవారం రాత్రి 10 గంటలకు రాజౌరీలోని మీరా-నగ్రోట్రా గ్రామంలో ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులు ఒక ఇంటి సమీపంలో కనిపించారు. దీంతో గ్రామ రక్షణ గార్డ్స్ గాలిలోకి కాల్పులు జరిపారు. ఆ తర్వాత ఆ అనుమానితులు అక్కడి నుంచి పారిపోయారు. సమాచారం అందుకున్న వెంటనే భద్రతా బలగాల సంయుక్త బృందం ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి, గాలింపు చర్యలు ప్రారంభించింది.
గ్రామాల్లో రక్షణ కోసం గ్రామ రక్షణ గార్డ్స్
జమ్మూ, కాశ్మీర్‌లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా భద్రతా దళాలు భద్రతను మరింత పెంచాయి. 1990లలో ఉగ్రవాద దాడులను నిరోధించడానికి గ్రామ రక్షణ కమిటీలు (VDC) ఏర్పాటు చేయగా, 2020లో వాటిని తిరిగి పునరుద్ధరించి, వేతనాల సదుపాయాన్ని కల్పించారు. ఈ కమిటీలు గ్రామాల్లో ప్రజలకు రక్షణ కల్పిస్తూ, ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి.