
Anant Ambani: ప్రీ వెడ్డింగ్ వేడుకలను అందుకే జామ్‌నగర్‌లో జరుపుకుంటున్నా: అనంత్ అంబానీ
ఈ వార్తాకథనం ఏంటి
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.
జులైలో వీరి వివాహం జరగనుండగా.. మార్చి 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఇంట్లో చివరి పెళ్లి కావడంతోఈ వేడుకలను అంబానీ ఫ్యామిలీ చాలా గ్రాండ్‍గా సెలబ్రేట్ చేస్తోంది.
అంబానీ ఇంట పెళ్లి వేడుకలకు గురించి దేశవ్యాప్తంగా తీవ్రమైన చర్చ జరుగుతోంది.
ప్రపంచవ్యాప్తంగా అతిథులు వస్తున్న ఈ వేడుకలను అంబానీ ఫ్యామిలీ జామ్‌నగర్‌లో ఎందుకు నిర్వహిస్తున్నారనే ప్రశ్న ఉత్పన్నమవతోంది.
అయితే ఈ అంశంపై స్వయంగా అనంత్ అంబానీ క్లారిటీ ఇచ్చారు.
రిలయన్స్
మా నాన్నమ్మ జామ్ నగర్‌లో పుట్టారు, ఇది నా ఊరు: అనంత్ అంబానీ
అనంత్ అంబానీ బుధవారం ఇండియా టుడేతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ప్రీ వెడ్డింగ్ వేడుకలను గుజరాత్‌లోని జామ్‌నగర్ అనే చిన్న గ్రామంలో ఎందుకు నిర్వహిస్తున్నారో వివరించారు.
ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన 'వెడ్ ఇన్ ఇండియా' స్ఫూర్తితో తాన పూర్వీకుల గ్రామమైన జామ్‌నగర్‌లో వేడుకలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
తనన నాన్నమ్మ జామ్ నగర్‌లో పుట్టారని, తాత ధీరూభాయ్ అంబానీ, తండ్రి ముఖేష్ అంబానీ ఇక్కడి నుంచే వ్యాపారం ప్రారంభించినట్లు పేర్కొన్నారు.
తాను కూడా కొంతకాలం ఇక్కడే పెరిగానని వెల్లడించారు. జామ్ నగర్‌లో తన వివాహ వేడుకను ప్లాన్ చేసుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు అనంత్ అంబానీ అన్నారు.
అనంత్
ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్‌లో 2500 రకాల వంటకాలు
అనంత్-రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకకు దాదాపు 1000 మంది విశిష్ట అతిథులు హాజరుకానున్నారు.
3 రోజుల పాటు జరిగే ఈ వేడుకలో అతిథులకు 2500 రకాల వంటకాలు వడ్డిస్తారు.
ఇండోర్ నుంచి దాదాపు 25 మంది చెఫ్‌లతో కూడిన ప్రత్యేక బృందాన్ని జామ్‌నగర్‌కు రప్పిస్తున్నారు.
బ్రేక్ ఫాస్ట్ మెనూలో 70 వెరైటీలు, భోజనంలో 250, రాత్రి భోజనంలో 250 రకాల ఆహార పదార్థాలను అతిథులకు అందించనున్నారు.
ఒకసారి వడ్డించిన వంటకాన్ని మళ్లీ రిపీట్ కాకుండా జాగ్రత్తులు తీసుకుంటున్నారు.
అతిథుల నుంచి ప్రత్యేకంగా ఆర్డర్స్ తీసుకొని ఈ వంటలను సిద్ధం చేస్తుండం గమనార్హం.
ఈ గ్రాండ్ ఈవెంట్ కోసం వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను ఆహ్వానించారు. సినీ, రాజకీయ, అంతర్జాతీయ ప్రముఖులు హాజరుకానున్నారు.