Page Loader
Covid 19 New Variant JN.1: కరోనా న్యూ వేరియంట్ కలకలం..ఈ వైరస్ డిసెంబర్ లోనే ఎందుకు వ్యాప్తి చెందుతోంది?
Covid 19 New Variant JN.1: కరోనా న్యూ వేరియంట్ కలకలం..ఈ వైరస్ డిసెంబర్ లోనే ఎందుకు వ్యాప్తి చెందుతోంది?

Covid 19 New Variant JN.1: కరోనా న్యూ వేరియంట్ కలకలం..ఈ వైరస్ డిసెంబర్ లోనే ఎందుకు వ్యాప్తి చెందుతోంది?

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 25, 2023
01:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

2019 డిసెంబర్ లో ప్రపంచం అంతా 2020 నూతన సంవత్సరానికి స్వాగతం పలకడానికి సిద్దమవుతున్న తరుణంలో చైనాలో భయంకరమైన కరోనా వైరస్ వ్యాప్తి చెంది ప్రజల జీవితాలను అస్తవ్యస్తం చేసింది. ఇప్పుడు మరోసారి 2023 కి స్వస్తి చెప్పి 2024లోకి అడుగుపెడుతున్న సమయంలో కరోనా న్యూ వేరియంట్ కలకలం రేపుతోంది. నాలుగు సంవత్సరాల తరువాత, కొవిడ్-19 మహమ్మారి తగ్గుముఖం పట్టింది, కానీ ఈ వైరస్ మన జీవితాల్లో అనేక పరిణామ రూపాల్లో ఇంకా ఉనికిలోనే ఉంది. ఈ డిసెంబర్‌లో,మహమ్మారికి కారణమైన కరోనా వైరస్ కొత్త వేరియంట్ JN.1 ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది.

Details 

కేరళలో బయటపడిన న్యూ వేరియంట్ కేసులు

ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) JN.1 ద్వారా ప్రమాదం తక్కువగా ఉన్నందన దీన్ని 'వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్' జాబితాలో చేర్చింది. ప్రస్తుతం ఈ వేరియంట్ వ్యాప్తి చెందుతున్న తీరు చూస్తే మళ్లీ కరోనా మొదటి వేవ్ పరిస్థితులను సృష్టించేలా కనిపిస్తోంది. ఇటీవల మొదటగా కేరళలో ఈ కొత్త కరోనా వేరియంట్ కేసులు బయటపడ్డాయి. మెల్లిమెల్లిగా వాటి సంఖ్య పెరుగుతూ వస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజలు జాగ్రత్తగా వుండాలని హెచ్చరించింది. కోవిడ్-19 డిసెంబర్ 2020లో ఆల్ఫా (B.1.1.7), బీటా (B.1.351),గామా (P.1) గా రూపాంతరం చెందింది. ఇక 2021 డిసెంబర్ లో లాక్‌డౌన్‌ సడలించడం ప్రారంభించిన కొద్ది నెలలకే Omicron వేరియంట్ గా మారి ప్రజలపై దాడి చేసింది.

Details 

ఈ వైరస్ డిసెంబర్ లోనే ఎందుకు వ్యాప్తి చెందుతోంది?

మరుసటి సంవత్సరం,డిసెంబర్ 2022లో,కొత్త వేరియంట్ BA.2, BA.5 ఆవిర్భవించనప్పటికీ అవి ప్రజలపై పెద్ద ప్రభావం చూపించలేదు. ప్రస్తుతం JN.1 వేరియంట్ రూపంలో కరోనా మహమ్మారి ప్రజలపై దాడి చేసేందుకు సిద్దమయ్యింది.ఈ వేరియంట్ కూడా Omicron వంశానికి చెందినది. ఈ వైరస్ డిసెంబర్ లోనే ఎందుకు వ్యాప్తి చెందుతోంది? దానికి గల కారణాలను కొన్ని సర్వేలు బయటపెట్టాయి. అయితే వాటికంటే ముందుగా, ఈ కొత్త వేరియంట్ గురించి తెలుసుకుందాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ద్వారా JN.1గా పిలువబడే కరోనావైరస్ తాజా వేరియంట్'వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్'గా ప్రకటించబడింది.

Details 

శీతాకాలంలో చల్లటి గాలులు వైరస్ వ్యాప్తికి అనుకూలం

ఇది ఇప్పటికే భారతదేశం,చైనా,యునైటెడ్ కింగ్‌డమ్,యునైటెడ్ స్టేట్స్‌తో సహా అనేక దేశాలలో కనుగొనబడింది. అనేక అధ్యయనాలు శీతాకాలంలో చల్లటి గాలులు వైరస్ వ్యాప్తికి అనుకూలంగా ఉంటాయని చెబుతున్నాయి. అంతేకాదు కరోనా వైరస్ వేడి వాతావరణంలో జీవించలేదు కాబట్టి వైరస్ వ్యాప్తి కనిపించదని చెబుతున్నారు. చైనాలోని సిచుయాన్ ఇంటర్నేషనల్ స్టడీస్ యూనివర్శిటీ పరిశోధకులు కూడా ఇదే విధమైన పరికల్పనను ధృవీకరించారు. వేడి వాతావరణంలో ఉండేవారికి కరోనా రిస్క్ తక్కువగా వుంటుందని,అదే చల్లటి వాతావరణంలో ఉండే వారికీ కరోనా వైరస్ రిస్క్ ఎక్కువగా ఉంటుందని అధ్యయనం కనుగొంది. కాబట్టి డిసెంబర్ లో అంటే కొత్త సంవత్సరం ముందు వైరస్ వ్యాప్తి ఎక్కువగా వుంటుందని సర్వేలు చెబుతున్నాయి.