
'అధికారులు చేసిన తప్పుకు చంద్రబాబును అరెస్టు చేస్తారా?'.. మాజీ ఐఏఎస్ అధికారి వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి జైలులో ఉన్నారు.
అయితే చంద్రబాబు అరెస్టుపై మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ స్పందించారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు పీవీ రమేశ్ ఆర్థికశాఖ ఉన్నతాధికారిగా ఉన్నారు.
ఈ నేపథ్యంలో స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో పీవీ రమేశ్ తన లిఖితపూర్వక వాంగ్మూలం ఇచ్చారు. అయితే ఈ కేసులో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబుపై కేసు పెట్టడంపై రమేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చంద్రబాబును అరెస్ట్ చేయడం హాస్యాస్పదంగా ఉదన్నారు.
తాను అప్రూవర్‌గా మారినట్లు వస్తున్న వార్తలు నిజం కాదన్నారు. అసు ఈ కేసులో ఫైలే లేదని ఆయన చెప్పారు.
చంద్రబాబు
వారి పేర్లు ఎందుకు లేవు: పీవీ రమేష్
సీఐడీ ఊహించుకున్నట్లు స్కిల్ డెవలప్‍మెంట్‌లో ఆర్థికశాఖ ఎలాంటి తప్పు చేయలేదని పీవీ రమేష్ అన్నారు.
ఆంధ్రప్రదేశ్ సీఐడీ వ్యవహారంపై తనకు అనుమానాలు ఉన్నాయన్నారు. అయితే తాను ఇచ్చిన వాంగ్మూలాన్ని సీఐడీ తనకు అనుకూలంగా మార్చుకున్నట్లు తనుకు అనుమానంగా ఉందన్నారు.
నిజంగా ఈ కేసులో అవినీతి జరిగితే, అందరి పేర్లు ఎందుకు లేవని ఆయన నిలదేశారు. కొందరి పేర్లు మాత్రమే ఎందుకున్నాయని ఆయన ప్రశ్నించారు.
స్కిల్ డెవలప్‍మెంట్ ఎండీ, కార్యదర్శిల పేర్లు కేసులో లేకపోవడంపై పీవీ రమేశ్ అనుమానం వ్యక్తం చేశారు.