
Asaduddin Owaisi: '2029 ఎన్నికల వరకైనా కులగణన పూర్తవుతుందా?' కేంద్రాన్ని ప్రశ్నించిన ఓవైసీ!
ఈ వార్తాకథనం ఏంటి
జాతీయ జనాభా లెక్కలతో పాటు కులగణన కూడా చేపడతామని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. 2024 సాధారణ ఎన్నికల నాటినుంచి కాంగ్రెస్ సహా పలువురు ఇండీ కూటమి నేతలు ఈ డిమాండ్ చేస్తూ వస్తున్నారు.
తాజాగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఈ డిమాండ్‌కు సానుకూలంగా స్పందించడంతో, ఈ ప్రకటనపై రాజకీయంగా చర్చలు ముమ్మయ్యాయి.
అయితే కులగణన ప్రకటనపై ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ముఖ్యమైన ప్రశ్నలు లేవనెత్తారు. కులగణనకు స్పష్టమైన టైమ్‌లైన్ ఉండాలంటూ ఆయన డిమాండ్ చేశారు.
'బీజేపీ-ఎన్డీయే ప్రభుత్వం కులగణన ఎప్పుడు ప్రారంభించబోతోందో, ఎప్పుడు పూర్తి చేస్తుందో, దాన్ని ఎప్పుడు అమలు చేస్తుందో ఓ స్పష్టమైన టైమ్‌ఫ్రేమ్ ప్రకటించాలి.
Details
కేంద్రాన్ని ప్రశ్నించిన ఓవైసీ
ఈ ప్రక్రియ 2029లో జరిగే లోక్‌సభ ఎన్నికల ముందు పూర్తవుతుందా?' అని ఆయన ప్రశ్నించారు.
కులగణన అవసరాన్ని వివరిస్తూ ఓవైసీ, అమెరికాలో ఆఫ్రికన్ అమెరికన్లు, యూదులు, చైనీయులాంటి అనాధికార వర్గాలపై అమలైన విధానాల వల్లే అమెరికా శక్తివంతమైన దేశంగా ఎదిగిందని వ్యాఖ్యానించారు.
భారతదేశంలో కులగణన వల్ల వివిధ కులాల మధ్య భూ పంపిణీ, సామాజిక వనరుల వినియోగం వంటి విషయాలు బయటపడతాయని, ఈ సమాచారం పాలన పరంగా కీలకంగా ఉంటుందని చెప్పారు.
Details
కులగణన నిర్వహించాలి
ముస్లింలలోనూ కులగణన అనివార్యమని, పస్మాండ ముస్లింల వాస్తవిక స్థితిగతులు వెల్లడించేందుకు ఇది మేలైన మార్గమని తెలిపారు.
దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించాలని ఎంఐఎం 2021 నుంచే నిరంతరంగా డిమాండ్ చేస్తోందని ఆయన గుర్తు చేశారు.
చివరిసారిగా కులగణన 1931లోనే జరిగినదని చెప్పారు. కులగణన వల్ల ఎవరి వద్ద ఎంత భూమి ఉంది.
ఎవరి వద్ద భూమి లేదు అనే కీలకమైన అంశాలపై స్పష్టత వస్తుందని, ఇది సమాజానికి అవసరమని ఓవైసీ వివరించారు.