Covid-19 cases: కొత్తగా 116మందికి కరోనా.. ముగ్గురు మృతి
భారతదేశంలో గత 24 గంటల్లో మొత్తం 116 కరోనా (Covid-19) కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. వైరస్‌తో కర్ణాటకలో ముగ్గురు మరణించినట్లు వెల్లడించింది. మంగళవారం నాటికి దేశంలో యాక్టివ్ కేసులు 4,170 ఉండగా.. మరణాల సంఖ్య 5,33,337 కు చేరుకుంది. దేశంలో అత్యధికంగా సోమవారం 628 కొత్త కేసులు నమోదయ్యాయి. దేశంలో కోవిడ్ కొత్త వేరియంట్.. JN.1 (BA.2.86.1.1) ఆందోళన కగిలిస్తోంది. కొత్త వేరియంట్ వ్యాప్తిని కేంద్రం నిశితంగా పరిశీలిస్తోందని నీతి ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్ వీకే పాల్ అన్నారు. దేశంలో కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ, అందరూ ఇంట్లోనే ఉండి.. చికిత్స పొందుతున్నారని ఆయన వివరించారు.