Loading...
Viral Video: పల్నాడులో షాకింగ్ ఘటన.. మహిళ కడుపులో 14 పెన్నులు, 5 స్పూన్లు,కొవ్వొత్తి.. వైద్యుల షాక్!

Viral Video: పల్నాడులో షాకింగ్ ఘటన.. మహిళ కడుపులో 14 పెన్నులు, 5 స్పూన్లు,కొవ్వొత్తి.. వైద్యుల షాక్!

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 07, 2026
11:05 am

ఈ వార్తాకథనం ఏంటి

పల్నాడు జిల్లాలో ఆశ్చర్యానికి గురిచేసే అరుదైన వైద్య ఘటన వెలుగులోకి వచ్చింది. ఛాతీ నొప్పితో ఆసుపత్రికి వచ్చిన ఓ మహిళ కడుపులో పెద్ద సంఖ్యలో వస్తువులు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. శస్త్రచికిత్స చేసి 14 పెన్నులు, 5 చెక్క స్పూన్లు, ఒక కొవ్వొత్తి సహా మొత్తం 20 వస్తువులను బయటకు తీశారు. మానసిక సమస్యలతో బాధపడుతున్న ఆమె వాటిని మింగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

వివరాలు 

ఛాతీ నొప్పితో ఆసుపత్రికి..

నరసరావుపేట మండలం పెట్లూరివారిపాలేనికి చెందిన 33 ఏళ్ల మహిళకు కొన్ని రోజులుగా ఛాతీలో తీవ్రమైన నొప్పి వేధిస్తోంది.

దీంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు అవసరమైన పరీక్షలు నిర్వహించగా.. ఆమె కడుపులో పెద్ద సంఖ్యలో వస్తువులు ఉన్న విషయం బయటపడింది.

దీంతో వైద్యులు ఆశ్చర్యానికి గురయ్యారు.

మహిళ కడుపులో ఉన్న వస్తువులను తొలగించేందుకు వైద్యులు లాప్రోస్కోపిక్ విధానాన్ని ఎంచుకున్నారు.

కడుపులో చిన్న రంధ్రం చేసి శస్త్రచికిత్స నిర్వహించారు. ఈ ప్రక్రియలో 14 పెన్నులు, 5 చెక్క స్పూన్లు, ఒక కొవ్వొత్తి సహా మొత్తం 20 వస్తువులను సురక్షితంగా బయటకు తీశారు.

వివరాలు 

పెన్ను గుచ్చుకోవడంతోనే ఛాతీ నొప్పా?

మహిళ మింగిన పెన్నుల్లో ఒకదానికి క్యాప్ లేదని వైద్యులు గుర్తించారు.

ఆ పెన్ను కడుపులో గుచ్చుకుని ఉండటం వల్లే ఆమెకు తీవ్రమైన నొప్పి వచ్చి ఉండొచ్చని వైద్యులు భావిస్తున్నారు.

ప్రస్తుతం మహిళ ఆరోగ్యం నిలకడగా ఉందని, చికిత్స అనంతరం కోలుకుంటున్నారని తెలిపారు.

మహిళ తండ్రి నోముల హనుమంతరావు ఈ ఘటనపై స్పందించారు. తన కుమార్తె గత పదేళ్లుగా మానసిక అనారోగ్యంతో బాధపడుతోందని తెలిపారు.

రెండు నెలల క్రితమే ఆమెకు భర్త విడాకులు ఇచ్చాడని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ పరిణామాలతో తీవ్ర మానసిక వేదనకు గురైన ఆమె.. ఇలాంటి చర్యకు పాల్పడి ఉండవచ్చని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు.

ADVERTISEMENT

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నరసరావుపేటలో వింత ఘటన.. మహిళ కడుపులో 14 పెన్నులు!

ADVERTISEMENT