PM Modi: మహిళా సాధికారతే నా అసలైన సంపద: ప్రధాని మోదీ
ఈ వార్తాకథనం ఏంటి
గత పదేళ్లుగా మహిళల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.
అత్యాచారం వంటి క్రూరమైన నేరాలపై మరణశిక్ష విధించేలా చట్టాలను సవరించినట్లు తెలిపారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గుజరాత్‌లోని నవసారిలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
Details
మహిళా భద్రతకు కట్టుదిట్టమైన చట్టాలు
ఒక అమ్మాయి ఆలస్యంగా ఇంటికి వస్తే తల్లిదండ్రులు ప్రశ్నిస్తారు. కానీ, అబ్బాయిల విషయంలో అలా జరగదు. వారినీ ప్రశ్నించాల్సిన అవసరం ఉంది.
గత దశాబ్దంలో మహిళల భద్రతను మెరుగుపరచడానికి ప్రభుత్వం కృషి చేసింది. నేరాల నిరోధానికి చట్టాలను కఠినతరం చేశాం. అత్యాచార కేసుల్లో మరణదండన విధించేలా చట్టాలను మార్పు చేస్తామని మోదీ తెలిపారు.
గ్రామీణ మహిళల సాధికారతపై ప్రత్యేక దృష్టి
గ్రామీణ మహిళల సాధికారత కీలకమని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
'దేశ ఆత్మ గ్రామాల్లో ఉంది' అని మహాత్మా గాంధీ చెప్పిన మాటను గుర్తు చేస్తూ, 'మహిళలు మన గ్రామీణ ప్రాంతాలకు ఆత్మగా మారాలని అన్నారు.
Details
త్రిపుల్ తలాక్ నిర్మూలన
త్రిపుల్ తలాక్ చట్టాన్ని ప్రవేశపెట్టి లక్షలాది ముస్లిం మహిళల జీవితాలను రక్షించామని మోదీ తెలిపారు.
'మహిళల సారథ్యంలోని అనేక సంస్థలు విజయవంతంగా కొనసాగుతున్నాయి.
కోట్లాది మంది తల్లులు, సోదరీమణుల ఆశీర్వాదం తనకు ఉందన్నారు. అందువల్లనే నేను ప్రపంచంలోనే అత్యంత ధనికుడిని అని ప్రధానమంత్రి అన్నారు.