
Waqf Bill: భోపాల్‌లో వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతుగా ముస్లిం మహిళలు
ఈ వార్తాకథనం ఏంటి
దేశవ్యాప్తంగా వక్ఫ్ సవరణ బిల్లు చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.ఈ బిల్లుకు కొందరు మద్దతు ఇస్తుండగా, మరికొందరు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.
జెడియు, టిడిపి, జెడిఎస్ వంటి పార్టీలు ఈ బిల్లుకు మద్దతునిచ్చాయి. అయితే, ప్రతిపక్ష కూటమి దీనికి వ్యతిరేకంగా నిలిచింది.
కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లును రాజ్యాంగ విరుద్ధమైనదిగా పేర్కొంది. ఎస్పీ కూడా ఈ బిల్లును వ్యతిరేకిస్తామని స్పష్టం చేసింది.
ఇలాంటి పరిస్థితుల్లో తీవ్ర నిరసనల మధ్య కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టింది.
వివరాలు
భోపాల్‌ల నుండి భిన్నమైన మద్దతు
కేంద్ర మంత్రి కిరెణ్ రిజిజు ఈ బిల్లును ప్రవేశపెట్టి, ఇది ఆస్తితో సంబంధమైన అంశమని వివరించారు.
మేము ఈ బిల్లును విశాల దృక్పథంతో తీసుకొచ్చామని, ఇది మత వ్యవస్థలో జోక్యం చేసుకునే ప్రయత్నం కాదని పేర్కొన్నారు.
మరోవైపు, ఢిల్లీ మరియు భోపాల్‌లలోని ముస్లిం మహిళలు ఈ బిల్లుకు మద్దతు ప్రకటించారు. "మోడీ జీ, మీరు పోరాడండి... మేము మీ వెంటే ఉన్నాం" అంటూ నినదించారు.
ప్రతిపక్షాల నిరసనల మధ్య ఢిల్లీ, మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌ల నుండి భిన్నమైన మద్దతు వ్యక్తమైంది.
వివరాలు
మోడీ జీ, మీరు పోరాడండి... మేము మీ వెంటే ఉన్నాం
భోపాల్‌లో ముస్లిం మహిళలు పెద్ద సంఖ్యలో ప్రధాని మోడీకి మద్దతుగా ప్లకార్డులు పట్టుకుని నినదించారు.
ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలియజేశారు.
"మోడీ జీ, మీరు పోరాడండి... మేము మీ వెంటే ఉన్నాం" అంటూ నినాదాలు చేశారు.
ఢిల్లీలోనూ ముస్లిం మహిళలు వక్ఫ్ బిల్లుకు మద్దతుగా ముందుకు వచ్చారు. వారు ప్లకార్డులు పట్టుకుని, "వక్ఫ్ ఆస్తుల ఆదాయాన్ని నిజమైన యజమానులకు అందించినందుకు, వక్ఫ్ బోర్డులో మహిళలు, వెనుకబడిన ముస్లింలకు వాటా కల్పించినందుకు మోడీ జీకి ధన్యవాదాలు" అని పేర్కొన్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతుగా ముస్లిం మహిళలు
#WATCH | Madhya Pradesh: Women in Bhopal come out in support of Waqf (Amendment) Bill to be presented today in Lok Sabha. pic.twitter.com/CUaUA3Rtkh
— ANI (@ANI) April 2, 2025