
Women raped: కర్ణాటకలో దారుణం.. మహిళకు డ్రగ్ ఇచ్చి అత్యాచారం
ఈ వార్తాకథనం ఏంటి
సోషల్ మీడియాలో పరిచయమైన ఓ వ్యక్తి మహిళకు డ్రగ్ ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఆ తర్వాత మహిళను ఇంటి వద్ద దింపేందుకు ప్రయత్నించగా కొందరు వ్యక్తులు గమనించారు.
అపై కారును అడ్డుకొని పోలీసులకు సమాచారమిచ్చారు. ఈ ఘటన కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో చోటు చేసుకుంది.
ఓ మహికు ఇన్‌స్టాగ్రామ్ వ్యక్తి పరిచయమ్యాడు. శుక్రవారం కర్కాలకు కారులో వచ్చి ఆ వ్యక్తి ఆమెను కిడ్నాప్ చేశారు.
అటవీప్రాంతానికి ఆ మహిళను తీసుకెళ్లి బీర్‌లో డ్రగ్ కలిపి ఆమెతో బలవంతంగా తాగించారు.
Details
పోలీసులకు ఫిర్యాదు చేసిన యువతి కుటుంబ సభ్యులు
ఆపస్మారక స్థితిలో ఉన్న అమెపై ఆ వ్యక్తి, మరో ఫ్రెండ్ అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత మహిళను ఇంటి వద్ద దింపేందుకు ప్రయత్నించగా, కొందరు యువకులు కారును అడ్డుకున్నారు.
యువతి మత్తులో ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ మహిళను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనపై యువతి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడితో పాటు అతను వెంట ఉన్న మరో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
కిడ్నాప్, అత్యాచారం సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.