Page Loader
Women's Reservation Bill: మహిళా రిజర్వేషన్‌‌ను సాధించే వరకూ విశ్రమించేది లేదు: ఎమ్మెల్సీ కవిత
మహిళా రిజర్వేషన్‌‌ను సాధించే వరకూ విశ్రమించేది లేదు: ఎమ్మెల్సీ కవిత

Women's Reservation Bill: మహిళా రిజర్వేషన్‌‌ను సాధించే వరకూ విశ్రమించేది లేదు: ఎమ్మెల్సీ కవిత

వ్రాసిన వారు Stalin
Mar 10, 2023
12:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రస్తుత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ, తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు కుమార్తె కవిత శుక్రవారం దిల్లీలోని జంతర్‌ మంతర్ వద్ద ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ నిరసనలో సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కూడా పాల్గొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు తెలిపిన ప్రతిపక్ష పార్టీలు, మహిళా సంఘాలు ఒక్కొక్కటిగా వచ్చి దీక్షకు సంఘీభావం తెలుపుతున్నాయి. బిల్లు చాలా కాలంగా పెండింగ్‌లో ఉందని, దాన్ని వెంటనే పార్లమెంంట్‌లో ప్రవేశ పెట్టాలని కవిత డిమాండ్ చేశారు. రాజకీయాల్లో మహిళలకు సముచిత స్థానం కావాలని కోరారు. మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టంగా మారే వరకు విశ్రమించేది లేదని చెప్పారు.

కవిత

బీజేపీకి సంపూర్ణ మెజార్టీ ఉంది, బిల్లును చట్టం చేయాలి: కవిత

1996లో దేవెగౌడ ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టినా అది ఇంకా చట్టం చేయలేదన్నారు ఎమ్మెల్సీ కవిత. కేంద్రంలో బీజేపీకి సంపూర్ణ మెజార్టీ ఉందని, ఈ సమావేశాల్లోనే బిల్లును చట్టం చేయాలని డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు బీజేపీ ముందుకొస్తే అన్ని పార్టీలు మద్దతిస్తాయని కవిత పేర్కొన్నారు. నిరాహార దీక్షకు మద్దతు తెలిపిన బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు కవిత కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిరసన ప్రదర్శనలో నాటకాలు, పాటలు వంటి కార్యక్రమాలను కూడా ప్రదర్శించనున్నారు. దిల్లీ మద్యం పాలసీ స్కామ్‌కు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆమెను ప్రశ్నించడానికి ఒక రోజు ముందు కవిత నిరాహారదీక్ష చేపట్టడం గమనార్హం.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

దిల్లీలోని జంతర్‌ మంతర్ వద్ద ఒకరోజు నిరాహార దీక్షలో కవిత