NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఏ తప్పూ చేయలేదు, ఈడీ విచారణను ఎదుర్కొంటా: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత
    తదుపరి వార్తా కథనం
    ఏ తప్పూ చేయలేదు, ఈడీ విచారణను ఎదుర్కొంటా: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత
    ఏ తప్పూ చేయలేదు, ఈడీ విచారణను ఎదుర్కొంటా: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత

    ఏ తప్పూ చేయలేదు, ఈడీ విచారణను ఎదుర్కొంటా: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత

    వ్రాసిన వారు Stalin
    Mar 09, 2023
    03:03 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఎన్నికలు ఉన్న చోట మోదీ కంటే ముందే ఈడీ చేరిపోతుందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. ఎన్నికలు దగ్గర పడుతున్నందున తెలంగాణలో కూడా కేంద్ర ఏజెన్సీలు దాడులు చేస్తున్నాయని ఆరోపించారు. గురువారం దిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.

    దిల్లీ మద్యం కేసులో కల్వకుంట కవితకు బుధవారం ఈడీ నోటీసులు జారీ చేసింది. తొలుత ఈడీ మార్చి 9న కవితను విచారణకు పిలిచింది. అయితే 16వ తేదీన వస్తానని కవిత రిప్లే ఇచ్చింది. కానీ ఈడీ అధికారులు ఎందుకు తొందర పడుతున్నారో తెలియదు కానీ, మార్చి 11న విచారణకు అంగీకరించారని కవిత వెల్లడించారు.

    తాము ఎలాంటి తప్పు చేయలేదని, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌విచారణను ఎదుర్కొంటామని కవిత పేర్కొన్నారు.

    కవిత

    మహిళా రిజర్వేషన్ బిల్లుపై రేపు ధర్నా: కవిత

    మహిళా రిజర్వేషన్ బిల్లుపై శుక్రవారం ధర్నా చేపట్టనున్నట్లు కవిత తెలిపారు. దిల్లీలో నిరాహారదీక్షపై మార్చి 2న పోస్టర్‌ను విడుదల చేసినట్లు చెప్పారు. 18 పార్టీలకు చెందిన ప్రతినిధులు నిరాహార దీక్షలో పాల్గొననున్నట్లు కవిత వెల్లడించారు.

    మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందేలా చూడాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కవిత అభ్యర్థించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టిన యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీకి సెల్యూట్ చేస్తున్నట్లు చెప్పారు.

    అలాగే పార్లమెంట్‌లో మహిళల ప్రాతినిధ్య 14శాతం మాత్రమేనని, అదే పాకిస్థాన్‌లో అయితే 17శాతం ఉన్నారని పేర్కొన్నారు.

    మహిళా రిజర్వేషన్ బిల్లు సాధనకు చేస్తున్న ధర్నాకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి కవిత కృతజ్ఞతలు తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కల్వకుంట్ల కవిత
    భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్
    దిల్లీ

    తాజా

    Census: 2027 మార్చి 1 నుంచి జనగణన ప్రారంభం..: కేంద్రం వెల్లడి భారతదేశం
    #NewsBytesExplainer: కన్నడకు మూలం తమిళమా? కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలపై విశ్లేషణ కమల్ హాసన్
    Bengaluru: ఆర్‌సిబి విజయోత్సవ వేడుకల్లో విషాదం.. తొక్కిసలాటలో 8మంది మృతి బెంగళూరు
    Tomato: ప్రాణాంతక బ్యాక్టీరియాతో టమాటోలు.. అమెరికాలో సాల్మొనెల్లా కలకలం! అమెరికా

    కల్వకుంట్ల కవిత

    దిల్లీ లిక్కర్ కుంభకోణం.. కొత్త ఛార్జ్‌షీట్‌లోనూ కవిత పేరు భారతదేశం
    ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం ప్రయత్నం: ఎమ్మెల్సీ కవిత బడ్జెట్
    దిల్లీ లిక్కర్ కేసు: కవిత మాజీ ఆడిటర్‌ను అరెస్టు చేసిన సీబీఐ సీబీఐ
    దిల్లీ మద్యం కేసు: వ్యాపారవేత్త గౌతమ్ మల్హోత్రాను అరెస్టు చేసిన ఈడీ దిల్లీ

    భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్

    ఎమ్మెల్యేల ఎర కేసు: అప్పటి వరకు విచారణకు రాలేనంటూ ఈడీకి రోహిత్ రెడ్డి మెయిల్ తెలంగాణ
    ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్ విస్తరణపై కేసీఆర్ ఫోకస్.. పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఆయనకేనా? ఆంధ్రప్రదేశ్
    ఖమ్మంలో బీఆర్ఎస్ తొలి సభ.. ముగ్గురు సీఎంలకు కేసీఆర్ ఆహ్వానం! కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ను కలిసిన ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్ భారతదేశం

    దిల్లీ

    ఉత్తర్‌ప్రదేశ్, హర్యానాలో భూకంపం, రిక్టర్ స్కేలుపై 3.2తీవ్రత నమోదు ఉత్తర్‌ప్రదేశ్
    ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ ఇంట్లో కాల్చుకుని సీఆర్పీఎఫ్ జవాన్ ఆత్మహత్య భారతదేశం
    శ్రద్ధా వాకర్ హత్య కేసులో సంచలనాలు: ఎముకలను కాల్చి, గ్రైండ్ చేసిన ఆఫ్తాబ్ భారతదేశం
    అఫ్ఘానిస్థాన్, పాలస్తీనా కంటే అధ్వానంగా కశ్మీర్: ముఫ్తీ జమ్ముకశ్మీర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025