Women's Day: భారత రాజకీయాల్లో అత్యంత శక్తిమంతమైన మహిళా నాయకురాళ్లు వీళ్లే
పురుషాధిక్య భారతీయ సమాజంలో మహిళలకు రాజకీయాల్లో పరిమిత సంఖ్యలో అవకాశాలు దక్కాయి. కాలానుగూనంగా వస్తున్న మార్పుల నేపథ్యంలో కొందరు నాయకురాళ్లు స్వశక్తితో ఎదిగి దేశ రాజకీయాల్లో తమదైన ముద్రవేశారు. ఇందిరా గాంధీ: భారతదేశంలో అత్యంత శక్తివంతమైన మహిళా రాజకీయ నాయకురాలుగా ఇందిరా గాంధీ పేరుగాంచారు. 1966లో భారతదేశానికి మొదటి మహిళా ప్రధానమంత్రి అయ్యారు. సుచేతా కృప్లానీ: దేశంలోనే కాకుండా ఉత్తర్‌ప్రదేశ్‌కు మొదటి మహిళా ముఖ్యమంత్రిగా సుచేతా గుర్తింపు పొందారు. భారత మొదటి మహిళా గవర్నర్ కూడా ఈమెనే. స్వాతంత్య్ర ఉద్యమంలో కీలకంగా పాల్గొన్నారు. జయలలిత: తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత పనిచేశారు. తమిళ ప్రజలు ఆమెను 'అమ్మా' అని సంబోధించేవారు. దేశ రాజకీయాలను ప్రభావితం చేసిన ఆమె లక్షలాది మంది ప్రజలకు ఆరాధ్య దైవం.
వందేళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘకాలం ప్రెసిడెంట్‌గా పని చేసిన సోనియా
సోనియా గాంధీ: అన్ని కాలాల్లోనూ గొప్ప మహిళా రాజకీయ నాయకుల్లో సోనియా గాంధీ ఒకరు. వంద ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘకాలం ప్రెసిడెంట్‌గా పనిచేశారు. ఫోర్బ్స్ మ్యాగజైన్ వెల్లడించిన అత్యంత శక్తివంతమైన మహిళల్లో 9వ స్థానంలో నిలిచారు. సుష్మా స్వరాజ్: బీజేపీలో చిన్నమ్మగా పేరు గాంచిన సుష్మా దేశ రాజకీయాల్లో తనదైన ముద్రను వేశారు. కేంద్ర విదేశాంగ మంత్రిగా కీలక పాత్రను పోషించారు. దిల్లీకి మొదటి మహిళా ముఖ్యమంత్రిగా సేవలందించారు. మమతా బెనర్జీ: బెంగాల్‌కు మొదటి మహిళా ముఖ్యమంత్రిగా సమకాలిన భారత రాజకీయాలను శాసిస్తున్న మహిళా నేత మమతా బెనర్జీ. దేశానికి మొదటి మహిళా రైల్వేమంత్రి మమతే కావడం గమనార్హం. ప్రస్తుతం టీఎంసీ అధినేత్రగా మమత ప్రధాని పీఠంపై కన్నేశారు.