ఐక్యరాజ్యసమితి సమావేశంలో నిత్యానంద 'కైలాస' దేశ మహిళా ప్రతినిధులు
వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు, స్వయం ప్రకటిత దైవం, కైలాస దేశ వ్యవస్థాపకుడు, స్వామి నిత్యానంద మరోసారి వార్తల్లో నిలిచారు. ఐక్యరాజ్యసమితి నిర్వహించిన ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కుల జనరల్ అసెంబ్లీలో కైలాస దేశ ప్రతినిధులు హాజరయ్యారు.ఈ విషయాన్ని స్వయంగా నిత్యానంద తెలియజేశారు. జనీవాలో జరిగిన సమావేశంలో తమ ప్రతినిధులు హాజరైనట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఓ మహిళా ప్రతినిధి భారత్‌పై విమర్శలు చేశారు. స్వామి నిత్యానందను ఆ దేశం వేధిస్తోందని చెప్పారు. నిత్యానందకు రక్షణ కల్పించాలని కైలాస దేశ మహిళా ప్రతినిధి విజయప్రియ కోరారు.
2019లో దేశం నుంచి పారిపోయిన నిద్యానంద
హిందువుల కోసం స్వామి నిద్యానంద తొలి సార్వభౌమ దేశం కైలాసాన్ని ఏర్పాటు చేసినట్లు విజయప్రియ పేర్కొన్నారు. హిందూ నాగరికతను స్వామి నిద్యానంద కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ఆది శైవులు అనే వ్యవసాయ తెగలకు ఆయన పునర్జీవం పోస్తున్నారని వివరించారు. నిత్యానందపై భారత్‌లో పలు కేసులు నమోదయ్యాయి. అత్యాచారం, అపహరణ వంటి కేసుల్లో ఆయన ఆరోపణల ఎదుర్కొంటున్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో ఆయన 2019లో దేశం నుంచి పారిపోయారు. అనంతరం 2020లో తాను ఒక సొంత దేశాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు, దాని పేరు 'కైలాసం'గా ప్రకటించారు.