NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు సమన్లు జారీ చేసిన ఈడీ
    తదుపరి వార్తా కథనం
    ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు సమన్లు జారీ చేసిన ఈడీ
    మార్చి 9న ఇడి ముందు విచారణకు హాజరు కానున్న కవిత

    ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు సమన్లు జారీ చేసిన ఈడీ

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Mar 08, 2023
    11:35 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు కుమార్తె, భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) నాయకురాలు కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) మార్చి 9 (గురువారం) తమ ముందు విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది.

    రద్దు అయిన ఢిల్లీ మద్యం పాలసీలో అక్రమాలు, అవినీతికి సంబంధించి హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామ్‌చంద్రన్ పిళ్లైని ఈడీ అరెస్టు చేసిన ఒక రోజు తర్వాత ఇది జరిగింది. పిళ్లై ఈ కేసులో నిందితుడు, కవిత కూడా ఈ కంపెనీలో ఫ్రంట్‌మెన్‌గా పనిచేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

    లిక్కర్ కంపెనీ ఇండోస్పిరిట్స్‌లో కవితకు 65 శాతం వాటా ఉందని ఆరోపిస్తూ ఈడీ కేసు ఛార్జిషీట్‌లో కవిత పేరును నమోదు చేసింది.

    సంస్థ

    ఇండో స్పిరిట్ సంస్థలో కవిత తరపున భాగస్వామి అయిన పిళ్లై

    డిసెంబర్ 11, 2022న హైదరాబాద్‌లోని ఆమె ఇంట్లో దర్యాప్తు సంస్థ ఆమెను ప్రశ్నించింది. పిళ్లై, ఈడీకి ఇచ్చిన వాంగ్మూలంలో, తెలంగాణ ఎమ్మెల్సీ కవిత మరియు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మధ్య ఒప్పందం కుదిరిందని చెప్పారు. తాను ఇండో స్పిరిట్ సంస్థలో కవితకు ప్రాతినిధ్యం వహిస్తున్నానని, ఆమె తరపున భాగస్వామి అయ్యానని, భాగస్వామి కావడానికి అవసరమైన పెట్టుబడి కోసం నిధులను ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు.

    కవిత, విజయ్ నాయర్, దినేష్ అరోరాలతో కలిసి ఒబెరాయ్ మెయిడెన్స్‌లో జరిగిన సమావేశానికి తాను హాజరయ్యానని ఆయన చెప్పారు.

    ఇదిలా ఉండగా కవిత మహిళా రిజర్వేషన్ బిల్లును డిమాండ్ చేస్తూ, మార్చి 10 న జంతర్ మంతర్ వద్ద నిరసనకు పిలుపునిచ్చారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కల్వకుంట్ల కవిత
    తెలంగాణ రాష్ట్ర సమితి/ టీఆర్ఎస్
    తెలంగాణ
    భారతదేశం

    తాజా

    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్
    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్
    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్

    కల్వకుంట్ల కవిత

    దిల్లీ లిక్కర్ కుంభకోణం.. కొత్త ఛార్జ్‌షీట్‌లోనూ కవిత పేరు భారతదేశం
    ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం ప్రయత్నం: ఎమ్మెల్సీ కవిత బడ్జెట్
    దిల్లీ లిక్కర్ కేసు: కవిత మాజీ ఆడిటర్‌ను అరెస్టు చేసిన సీబీఐ సీబీఐ
    దిల్లీ మద్యం కేసు: వ్యాపారవేత్త గౌతమ్ మల్హోత్రాను అరెస్టు చేసిన ఈడీ దిల్లీ

    తెలంగాణ రాష్ట్ర సమితి/ టీఆర్ఎస్

    తెలంగాణాలో రూ.21,400 కోట్ల పెట్టుబడులు : కేటీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)

    తెలంగాణ

    రూ. 7 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ప్రభుత్వ ఉద్యోగి మర్డర్ డ్రామా భారతదేశం
    కేటీఆర్: తెలంగాణలో గ్లోబల్ రెస్టారెంట్ కంపెనీ 'ఇన్‌స్పైర్ బ్రాండ్స్' పెట్టుబడులు కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ ఇంట్లోకి చొరబడ్డి డిప్యూటీ తహశీల్దార్‌ సస్పెండ్ భారతదేశం
    హైదరాబాద్‌లో అమెజాన్ ఎయిర్ సేవలను ప్రారంభించిన మంత్రి కేటీఆర్ అమెజాన్‌

    భారతదేశం

    బిల్‌గేట్స్‌ను కలిసిన ఆనంద్ మహీంద్రా; ఇద్దరూ క్లాస్‌మెట్స్ అని మీకు తెలుసా? బిల్ గేట్స్
    మారుతి సుజుకి Ignis vs హ్యుందాయ్ గ్రాండ్ i10 NIOS ఏది కొనడం మంచిది ఆటో మొబైల్
    ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ ను ప్రారంభించిన తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల తిరుపతి
    అధిక ద్రవ్యోల్బణం కారణంగా 4.4% క్షీణించిన భారతదేశ మూడవ త్రైమాసిక GDP వృద్ధి వ్యాపారం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025