Loading...
PM Modi: మహిళా రిజర్వేషన్లను అడ్డుకోలేరు.. ప్రతిపక్షాలకు మోదీ సవాల్!
మహిళా రిజర్వేషన్లను అడ్డుకోలేరు.. ప్రతిపక్షాలకు మోదీ సవాల్!

PM Modi: మహిళా రిజర్వేషన్లను అడ్డుకోలేరు.. ప్రతిపక్షాలకు మోదీ సవాల్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 28, 2026
02:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

మహిళా రిజర్వేషన్ల అమలుకు ఎదురయ్యే అన్ని అడ్డంకులను తొలగిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. ఈ రిజర్వేషన్ల అమలును ప్రతిపక్ష పార్టీలు ఎప్పటికీ అడ్డుకోలేవని స్పష్టం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు. మహిళా రిజర్వేషన్ల విషయంలో 'నారీ శక్తి'కి ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. డీలిమిటేషన్‌-మహిళా రిజర్వేషన్‌ బిల్లును కేంద్రం ఈ నెల 30న లోక్‌సభలో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

వివరాలు

మహిళా రిజర్వేషన్లకు అడ్డంకులు తొలగిస్తాం

చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న అంశంపై దశాబ్దాలుగా పోరాటం సాగుతోంది.

ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్న వారిలో నేనూ ఒకడిని. ఎంతోమంది మహిళలు ఈ అంశాన్ని నా దృష్టికి తీసుకొస్తూనే ఉన్నారు.

చాలామంది సోదరీమణులు నాకు లేఖలు కూడా రాశారు. దేశంలోని నారీశక్తి మొత్తం ఆశీర్వాదం మాకు ఉంది.

మహిళా రిజర్వేషన్ల అమలు దారిలో ఎదురయ్యే ప్రతి అడ్డంకిని తొలగిస్తాం. ఇందుకోసం మేం దృఢ సంకల్పంతో ఉన్నాం. కేవలం సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నాం.

ప్రతిపక్ష పార్టీలు ఈ రిజర్వేషన్ల అమలును ఎప్పటికీ అడ్డుకోలేవు'' అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

ADVERTISEMENT