Loading...
Kakinada Gateway Port: కాకినాడ పోర్టుకు ప్రపంచంలోనే అతిపెద్ద డ్రెడ్జర్.. 2027లో కార్యకలాపాలు షురూ!
కాకినాడ పోర్టుకు ప్రపంచంలోనే అతిపెద్ద డ్రెడ్జర్.. 2027లో కార్యకలాపాలు షురూ!

Kakinada Gateway Port: కాకినాడ పోర్టుకు ప్రపంచంలోనే అతిపెద్ద డ్రెడ్జర్.. 2027లో కార్యకలాపాలు షురూ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 28, 2026
08:52 am

ఈ వార్తాకథనం ఏంటి

కాకినాడ గేట్‌వే పోర్టు నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి. 2027 ప్రథమార్ధంలోనే తొలి బెర్త్‌ను సిద్ధం చేసి పోర్టు కార్యకలాపాలు ప్రారంభించేందుకు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా భారీ నౌకలు పోర్టులోకి రాకపోకలు సాగించేందుకు అవసరమైన ఛానల్ లోతును పెంచుతున్నారు. ఇందుకోసం ప్రపంచంలోనే అతిపెద్ద డ్రెడ్జర్‌ను ప్రాజెక్టు వద్దకు తీసుకొచ్చారు.

వివరాలు

35 వేల క్యూబిక్ మీటర్ల హాపర్ సామర్థ్యం

ప్రముఖ డ్రెడ్జింగ్ సంస్థ బోస్కాలిస్‌కు చెందిన ఈ భారీ డ్రెడ్జర్ 231.5 మీటర్ల పొడవు, 35 వేల క్యూబిక్ మీటర్ల హాపర్ సామర్థ్యం కలిగి ఉంది.

సింగపూర్ నుంచి బయలుదేరిన ఈ నౌక కాకినాడ పోర్టు మీదుగా శుక్రవారం కాకినాడ గేట్‌వే పోర్టు లిమిటెడ్ (కేజీపీఎల్) ప్రాజెక్టు వద్దకు చేరుకుంది.

ఇసుక తొలగింపు పనులు ప్రారంభం

డ్రెడ్జర్ పోర్టుకు చేరుకున్న అనంతరం అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత సముద్రం అడుగున ఉన్న ఇసుకను తొలగించే పనులను ప్రారంభించారు.

ఛానల్ లోతును పెంచడం ద్వారా భారీ నౌకలు సైతం పోర్టులోకి ప్రవేశించేందుకు మార్గం సుగమం కానుంది.

2027 ప్రథమార్ధానికి తొలి బెర్త్‌ను సిద్ధం చేసి కార్యకలాపాలు ప్రారంభించాలనే లక్ష్యంతో పనులు కొనసాగుతున్నాయి.

ADVERTISEMENT