
జిమ్ నుంచి ఇంటికెళ్తున్న వైసీపీ కార్యకర్త.. బురఖా కప్పుకుని వచ్చి హత్య చేసిన ప్రత్యర్థులు
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ లోని కడపలో వైసీపీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యాడు. నగరంలోని సంధ్య సర్కిల్‌లో ఈ ఘోర ఘటన చోటు చేసుకుంది.
మృతుడు శ్రీనివాసులరెడ్డి, వైసీపీ నేత, ఆర్టీసీ చైర్మన్ దుగ్గా యపల్లె మల్లికార్జున్ రెడ్డికి ముఖ్య అనుచరుడిగా, పార్టీలో క్రియాశీలకమైన కార్యకర్తగా కొనసాగుతున్నాడు.
ప్రాథమిక సమాచారం మేరకు భూతగాదాలే ఈ ఘోరానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.
గత కొంతకాలంగా కడపకు చెందిన శ్రీనివాసులు రెడ్డికి, మరికొంత మందికి భూతగాదాలు ఉన్నాయి. ఈ క్రమంలో వివాదాలు మరింత ముదిరిపోయాయి.
దీంతో శ్రీనివాస్ రెడ్డిపై ప్రత్యర్థులు వ్యక్తిగత కక్ష పెంచుకున్నారు. ఈ నేపథ్యంలో అతడి అడ్డు తొలగించుకునేందుకు ఓ పథకం సిద్ధం చేసి హత్యకు కుట్ర చేశారు.
DETAILS
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన శ్రీనివాసులు రెడ్డి
శ్రీనివాసులు రెడ్డి, ఎప్పటిలాగే ఇవాళ ఉదయం కూడా జిమ్ చేశాడు. అనంతరం తన ఇంటికి బయల్దేరారు.
ఈ క్రమంలోనే బురఖా ధరించిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు, విచక్షణారహితంగా కత్తులతో దాడి చెయ్యడంతో శ్రీనివాసులు, రక్తపు మడుగులో కుప్పకూలిపోయాడు.
గమనించిన స్థానికులు అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ నేపథ్యంలో నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఘటన స్థలిలో లభించిన సీసీ ఫుటేజ్ ఆధారంగా త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.