బర్త్ డేకు ఇంటి పిలిచారని వెళ్తే, దొంగతనం పేరిట హింసించి చంపిన బంధువులు
బంధువుల ఆహ్వానిస్తే పుట్టినరోజు వేడుకలకు హాజరైన ఓ మహిళను దొంగతనం నెపంతో చిత్రహింసలకు గురిచేశారు. దారుణమైన శారీరక వేధింపులకు తట్టుకోలేక సమినా ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్ లోని ఘజియాబాద్‌లో చోటు చేసుకుంది. తమ ఇంట్లోని బంగారు ఆభరణాలను చోరీ చేసిందనే అనుమానంతో 23 ఏళ్ల సమినాను వేడుకలకు పిలిచి చుట్టాలే ఘోరంగా చంపేశారు. బ్లేడుతో శరీరంపై గాయాలు చేస్తూ, ఇనుప రాడ్లతో పొడుస్తుంటే నొప్పి భరించలేక తీవ్రమైన అరుపులు పెట్టింది. కేకలు ఎవరికీ వినబడకుండా పెద్ద పెద్ద శబ్దాలతో పాటలు పెట్టారు. ఈ క్రమంలో టార్చర్ తట్టుకోలేక సమినా ప్రాణాలు విడిచింది. ఈ నేపథ్యంలో నిందితులు ఘటనా స్థలం నుంచి పరారయ్యారు.
భారీ సౌండ్ తో మ్యూజిక్ వస్తున్న నేపథ్యంలో పోలీసులకు సమాచారం
గత 2 రోజులుగా పక్కింటి నుంచి భారీ సౌండ్ తో మ్యూజిక్ వస్తుండటాన్ని అనుమానించిన ఇరుగు పొరుగు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటకు వచ్చింది. ఘజియాబాద్‌లో ఉండే సమీనా బంధువులు హీనా, రమేశ్ దంపతుల కుమారుడి బర్త్ డే వేడుకల నిమత్తం ఆమెను పిలిచారు.ఇదే సమయంలో రూ.5 లక్షల విలువగల ఆభరణాలు మాయమయ్యాయి. దీనికి కారణం, సమీనానే అయ్యిండొచ్చని అనుమానించి ఆమెను పట్టుకుని కర్రలతో తీవ్రంగా చావబాదారు.నిజం ఒప్పుకోవాలంటూ బ్లేడ్త్ తో కోస్తూ చిత్రహింసలకు గురిచేశారు. వారు పెట్టె హింసను తట్టుకోలేని హసీనా రోదిస్తూ ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆందోళనకు గురైన నిందితులు, హడావుడిలో టీవీని కట్టేయకుండానే పారిపోయారు. ఈ మేరకు స్థానికుల సమాచారం మేరకు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.