
YCP MLA RK: ఏపీలో వైసీపీకి షాక్.. ఎమ్మెల్యే పదవి, వైసీపీకి ఆళ్ళ రామకృష్ణారెడ్డి రాజీనామా
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీకి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి అలియాస్ ఆర్కే షాకిచ్చారు.
వైసీపీకి, ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనానాను శాసనసభా కార్యదర్శికి ఆర్కే అందజేశారు.
వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు రాజీనామా లేఖలో ఆర్కే వివరించారు.
కొంతకాలంగా వైసీపీ అధిష్ఠానంపై ఆయన అసంతృప్తిగా ఉన్నారు.
మంగళగిరి నియోజకవర్గానికి నిధులు విడుదల విషయంలో ఆళ్ల అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.
అలాగే మంగళగిరి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా గంజి చిరంజీవిని వైసీపీ అధిష్టానం నియమించడంతో కొంతకాలంగా ఆర్కే పార్టీలో యాక్టివ్‌గా లేరు.
వైసీపీకి చేసిన రాజీనామా లేఖను పార్టీ కేంద్ర కార్యాలయానికి ఆర్కే పంపారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా
Mangalagiri YCP MLA Alla Ramakrishna Reddy resigns@YSRCParty @ysjaganpic.twitter.com/yUBeqdgQ7v
— PawanKalyan FC™ (@Legend_PSPK) December 11, 2023