Page Loader
Telangana Rains: ఎండల నుంచి ఉపశమనం.. రెండు రోజులు వానలు..17 జిల్లాలకు ఎల్లో అలర్ట్
ఎండల నుంచి ఉపశమనం.. రెండు రోజులు వానలు..17 జిల్లాలకు ఎల్లో అలర్ట్

Telangana Rains: ఎండల నుంచి ఉపశమనం.. రెండు రోజులు వానలు..17 జిల్లాలకు ఎల్లో అలర్ట్

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 10, 2025
08:27 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ రాష్ట్రంలో వచ్చే రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. బుధవారం విడుదల చేసిన ప్రకటనలో, వర్షాలు కురుస్తున్నా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగి మూడు డిగ్రీల వరకు పెరుగుతాయని స్పష్టం చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో పాటు,ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో కొన్ని జిల్లాల్లో వర్షాలు పడే సూచనలు ఉన్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలో భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో వర్షపాతం ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో యెల్లో అలర్ట్ జారీ చేసినట్లు పేర్కొంది.

వివరాలు 

ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం 

ఈ జిల్లాల్లో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని వివరించింది. హైదరాబాద్ నగరంలో కూడా వాతావరణం ఇదే తరహాలో ఉండొచ్చని పేర్కొంది. ఇక ఏప్రిల్ 12వ తేదీ నుంచి రాష్ట్రంలోని ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేసింది. ఆరేడు జిల్లాలు తప్ప మిగిలిన అన్ని జిల్లాలకూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు వెల్లడించింది.