RSS chief :ఇవాళ మోహన్ భగవత్‌తో సమావేశం కానున్న యోగి ఆదిత్యనాథ్
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శనివారం సాయంత్రం గోరఖ్‌పూర్‌లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) అధినేత మోహన్ భగవత్‌తో సమావేశం కానున్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత తన మొదటి ప్రకటనలో నిజమైన "సేవక్" అహంకారి కాదని, ప్రజలకు గౌరవప్రదంగా సేవ చేస్తాడని భగవత్ పేర్కొన్న కొద్ది రోజుల తర్వాత ఈ సమావేశం "మర్యాదపూర్వక సమావేశం"గా జరగనుంది. ఆయన ఈ వ్యాఖ్యలను పరోక్షంగా బిజెపిపై చేశారని రాజకీయవర్గాల్లో చర్చజరుగుతోంది. బీజేపీతో తమకు విభేదాలు వచ్చాయనే ప్రచారాన్ని ఆరెస్సెస్ కొట్టిపారేసింది భగవత్ వ్యాఖ్యలను అనుసరించి, ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడు ఇంద్రేష్ కుమార్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన తన వ్యాఖ్యలను శుక్రవారం ఉపసంహరించుకున్నారు.
ఆగస్టు 31 నుండి వార్షిక సమన్వయ సమావేశాలు
ఆర్‌ఎస్‌ఎస్ సమావేశాలు నిర్వహించాలని, ఊహాగానాలను కొట్టిపారేసింది రెండు సంస్థల మధ్య ఎలాంటి విభేదాలు లేవని, గందరగోళాన్ని సృష్టించేందుకు ఉద్దేశించిన ఊహాగానాలు మాత్రమేనని,తేల్చి చెప్పింది. చీలికకు సంబంధించిన ఏవైనా వార్తలను కొట్టిపారేయాలని ఆర్‌ఎస్‌ఎస్ వర్గాలు నొక్కిచెప్పాయి. "ఆయన 'అహంకార' వ్యాఖ్య ఎప్పుడూ ప్రధాని నరేంద్ర మోడీని, ఏ బిజెపి నాయకుడిని ఉద్దేశించి చేయలేదు" అని వర్గాలు తెలిపాయి. బిజెపితో సహా దాని అనుబంధ సంస్థలతో తమ సంస్థ వార్షిక సమన్వయ సమావేశం త్వరలో నిర్వహించనున్నామని ఆర్‌ఎస్‌ఎస్ తెలిపింది. మూడు రోజుల వార్షిక సమన్వయ సమావేశం ఆగస్టు 31 నుండి కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో నిర్వహించనున్నట్లు వారు పేర్కొన్నారు.
2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ పనితీరు
2024 లోక్‌సభ ఎన్నికలలో, బిజెపి తన ప్రతిష్టాత్మక లక్ష్యం 370 సీట్లకు దూరమైంది. కేవలం 240 సీట్లు మాత్రమే సాధించింది. సొంతంగా మెజారిటీ సాధించడంలో విఫలమైనందున, ఆ పార్టీ వరుసగా మూడో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 'కింగ్‌మేకర్లు' నితీష్ కుమార్ , ఎన్ చంద్రబాబు నాయుడులపై ఆధారపడవలసి వచ్చింది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 80 స్థానాలకు గాను 33 స్థానాల్లో మాత్రమే బీజేపీ గెలుపొందింది. ఇది గతంతో పోలిస్తే గణనీయంగా తగ్గింది. ఈ నేపధ్యంలో యోగి ఆదిత్యనాధ్ , భగవత్ తో జరగబోయే సమావేశం ప్రాధాన్యత సంతరించకుంది.