Ys Sharmila : దొంగకు ఓట్లేయకండన్న వైఎస్ షర్మిల.. ఇంతకీ ఎవరా దొంగ
ఈ వార్తాకథనం ఏంటి
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు చీలకూడదని ఈసారి తాము ఎన్నికల్లో పోటీ చేయట్లేదని చెప్పిన షర్మిల కాంగ్రెస్ పార్టీకి ఇటీవలే మద్ధతు ప్రకటించారు.
ఇంతలోనే ఆ పార్టీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై పరోక్షంగా తీవ్ర విమర్శలు గుప్పించారని పొలిటికల్ సర్కిల్స్ టాక్.
ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి దొంగ అని సుప్రీం కోర్టే చెప్పిందని సోమవారం హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో షర్మిల అన్నారు.
ఇదే సమయంలో రేవంత్ రెడ్డిని అందరూ రేటెంత రెడ్డి అని అంటున్నారని, ఆ పేరు తాను పెట్టలేదన్నారు.
అన్ని పార్టీల్లోనూ దొంగలు ఉంటారని, ఆ దొంగలు ఎప్పుడు సీఎంలు కాలేరని కుండబద్దలు కొట్టారు.
DETAILS
సజ్జల గారు ముందు మీ కథ మీరు చూసుకోండి : షర్మిల
మరోవైపు ఏపీలో అధికార పార్టీ వైసీపీపైనా షర్మిల కౌంటర్ ఇచ్చారు. అప్పట్లో తమ పార్టీతో ఏ సంబంధం లేదన్న సజ్జల, ఇప్పుడు ఏ సంబంధం ఉందని తనపై మాట్లాడుతున్నారని ఆమె చురకలు అంటించారు.
తాము మాత్రం వైసీపీతో సంబంధం లేదనే అనుకుంటున్నట్లు షర్మిల చెప్పుకొచ్చారు. తమతో ఏం సంబంధం ఉందో ఏపీ ప్రభుత్వ సలహాదారుడు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జలే సమాధానం చెప్పాలన్నారు.
ఇదే సమయంలో ఏపీలో రోడ్లు, విద్యుత్‌పై తెలంగాణ సీఎం కేసీఆర్ బహిరంగ సభల్లోనే విమర్శించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు.
దీనికి సజ్జల ఏం సమాధానం చెబుతారని నిలదీశారు.సజ్జల గారు ముందు మీ కథ మీరు చూసుకోండని షర్మిల ఎద్దేవా చేశారు.