Page Loader
YS Sharmila: చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్లిన వైఎస్ షర్మిల 
YS Sharmila: చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్లిన వైఎస్ షర్మిల

YS Sharmila: చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్లిన వైఎస్ షర్మిల 

వ్రాసిన వారు Stalin
Jan 13, 2024
12:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కాంగ్రెస్ నాయకురాలు వైఎస్ షర్మిల శనివారం కలిశారు. చంద్రబాబు ఇంటికి వైఎస్ షర్మిల వెళ్లడం ఏపీలో రాజకీయంగా సంచలనంగా మారింది. వైఎస్ షర్మిల తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహానికి ఆహ్వానించేందుకు చంద్రబాబు ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా ఇద్దరు దాదాపు 20 నిమిషాల పాటు చర్చించుకున్నారు. చంద్రబాబు ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. తాము రాజకీయాల గురించి చర్చించలేదన్నారు. దివంగత వైఎస్‌ఆర్‌తో తనకున్న మంచి స్నేహాన్ని చంద్రబాబు గుర్తు చేసుకున్నారన్నారు. తన కుమారుడి వివాహానికి వస్తానని చంద్రబాబు చెప్పినట్లు వెల్లడించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

చంద్రబాబుతో వైఎస్ షర్మిల సమావేశం