Page Loader
Minister Roja: బెంగళూరు పబ్‌లో చిందేసిన రోజా.. మండిపడుతున్న నెటిజన్లు (వీడియో)
బెంగళూరు పబ్‌లో చిందేసిన రోజా.. మండిపడుతున్న నెటిజన్లు (వీడియో)

Minister Roja: బెంగళూరు పబ్‌లో చిందేసిన రోజా.. మండిపడుతున్న నెటిజన్లు (వీడియో)

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 02, 2024
05:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

వైసీపీ మంత్రి రోజా సెల్వమణి(Minister Roja) మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా నూతన సంవత్సరం వేడుకల్లో భాగంగా రోజా సెలబ్రేషన్స్ హాట్ టాపిక్‌గా మారాయి. తన కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులతో కలిసి బెంగళూరులో న్యూ ఇయర్ వేడుకులను రోజా జరుపుకున్నారు. మంత్రి రోజా బెంగళూరు పబ్‌లో డ్యాన్స్ లు చేస్తూ, పాటలకు లయబద్దంగా స్టెప్పులేశారు. గతంలో మంత్రిగా ఉన్న భూమా అఖిల ప్రియా నంద్యాల ఉప ఎన్నికల్లో పంజాబీ డ్రెస్ వేసుకొని ప్రచారం చేయడంతో రోజా తీవ్రస్థాయిలో కామెంట్స్ చేసింది. ఇప్పుడు అదే మంత్రి పదవిలో ఉన్న రోజా ఇలా పబ్‌లో డ్యాన్స్ లు చేయడం ఏమిటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పబ్ లో డాన్స్ చేసిన రోజా