Loading...
'Scam Hi Scam': ఆలస్యమైన జొమాటో ఆర్డర్‌.. ట్రాక్ చేస్తే షాకింగ్ దృశ్యం..
ఆలస్యమైన జొమాటో ఆర్డర్‌.. ట్రాక్ చేస్తే షాకింగ్ దృశ్యం..

'Scam Hi Scam': ఆలస్యమైన జొమాటో ఆర్డర్‌.. ట్రాక్ చేస్తే షాకింగ్ దృశ్యం..

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 07, 2026
05:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు కొంత ఆలస్యం కావడం సాధారణమే. కానీ ఢిల్లీ-ఎన్‌సీఆర్‌కు చెందిన ఓ కస్టమర్‌కు ఎదురైన అనుభవం మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. తాను ఆర్డర్ చేసిన ఆహారాన్ని డెలివరీ భాగస్వామి డెలివరీ చేయకుండా తింటున్నాడని ఆయన చేసిన ఆరోపణలు చర్చకు దారితీశాయి. ఆదివారం రాత్రి 10:58 గంటలకు రిషబ్ కౌశిక్ జొమాటో యాప్‌లోని 'ఖడక్ సింగ్ కా ధాబా' నుంచి ఫుడ్ ఆర్డర్ చేశారు. ఆర్డర్ కోసం ఎదురుచూస్తుండగా.. యాప్‌లోని డెలివరీ ట్రాకర్‌లో డెలివరీ బాయ్ కదలకుండా ఒకే ప్రదేశంలో దాదాపు 40 నిమిషాల పాటు ఉన్నట్లు కనిపించింది. దీంతో అనుమానం వచ్చిన రిషబ్.. ట్రాకర్ చూపించిన ప్రాంతానికి స్వయంగా వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

వివరాలు 

ఆర్డర్‌ను రూ.100కు విక్రయించినట్లు తెలిపిన కస్టమర్ సపోర్ట్

అక్కడికి చేరుకున్న ఆయనకు ఊహించని దృశ్యం కనిపించిందని తెలిపారు.

తన కోసం తీసుకొచ్చిన ఆహారాన్ని డెలివరీ బాయ్ మరో వ్యక్తితో కలిసి తింటూ కనిపించాడని రిషబ్ ఆరోపించారు.

ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలను ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

స్కూటర్ పక్కన పడివున్న ఫుడ్ కంటైనర్లు, మిగిలిపోయిన ఆహారం కూడా ఆ ఫొటోల్లో కనిపించాయి.

తన ఆర్డర్‌ను రూ.100కు విక్రయించినట్లు కస్టమర్ సపోర్ట్ టీమ్ తనకు చెప్పిందని రిషబ్ పేర్కొన్నారు.

డెలివరీ సర్వీస్‌ పేరుతో జరుగుతున్నది చూస్తుంటే ఇది 'ఫుడ్-షేరింగ్ ఎకానమీ'గా మారినట్లుందని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

వివరాలు 

స్పందించిన జొమాటో కేర్

ఈ వ్యవహారంపై జొమాటో కేర్ కూడా స్పందించింది.

ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకుని విచారణ చేపట్టేందుకు ఆర్డర్ ఐడీని తమకు పంపించాలని రిషబ్‌ను కోరింది.

రిషబ్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పలువురు నెటిజన్లు స్పందించారు.

తమకు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని కొందరు తమ కథలను పంచుకున్నారు.

ముఖ్యంగా రాత్రి సమయాల్లో ఆహారం ఆర్డర్ చేసేటప్పుడు క్యాష్-ఆన్-డెలివరీ (COD)ఎంపిక చేసుకోవడం మంచిదని కొందరు సూచిస్తున్నారు.

ఈ ఘటనతో ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లపై వినియోగదారులకు ఉండాల్సిన నమ్మకం,డెలివరీ భాగస్వాముల బాధ్యత, ఆర్డర్ల భద్రత వంటి అంశాలపై మరోసారి చర్చ మొదలైంది.

అయితే, రిషబ్ చేసిన ఆరోపణలపై జొమాటో విచారణ అనంతరం ఏ వివరాలు వెల్లడిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ADVERTISEMENT

ట్విట్టర్ పోస్ట్ చేయండి

డెలివరీ బాయ్ ఏం చేశాడంటే?

ADVERTISEMENT