
Motivational : జీవితంలో ఎదగాలంటే తప్పకుండా పాటించాల్సిన మూడు మంత్రాలు..!
ఈ వార్తాకథనం ఏంటి
కష్టే ఫలి.. అనే మాటను మన పెద్దలు తరచూ చెబుతూవుంటారు. నిజానికి జీవితంలో ఎదగాలంటే, వారి చెప్పే మాటలను గౌరవించాల్సిందే. ఒక్కోసారి విజయం ఆలస్యం కావొచ్చు, కానీ దాని కోసం నిరంతరం కృషి చేస్తే ఫలితం తప్పదు. ఎందుకంటే విజయం అన్నదీ ఎవరికీ తక్షణమే లభించదు. దానికి పునాది కష్టమే. అందుకే చాణక్యుడు తన నీతిలో విజయం సాధించాలంటే మూడు ముఖ్యమైన సూత్రాలను పాటించమంటారు. ఆ మూడు సూత్రాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
వివరాలు
మానవ జీవనపథానికి సంబంధించి విలువైన మార్గదర్శకాలను అందించిన చాణక్యుడు
బహుముఖ ప్రతిభావంతుడైన చాణక్యుడు, ఉపాధ్యాయుడు, తత్త్వవేత్త, ఆర్థిక నిపుణుడు, న్యాయవాది, వ్యూహరచయిత, రాజసలహాదారుగా అనేక రంగాల్లో అసాధారణ కీర్తిని సాధించారు. నీతిశాస్త్ర రచయితగా మానవ జీవనపథానికి సంబంధించి విలువైన మార్గదర్శకాలను అందించారు. ఆయన బోధనలు ఎవరు జీవితం లో ఆచరిస్తే, వారెవరైనా అభివృద్ధి దిశగా సాగవచ్చు. ఆయన చెప్పిన మూడు ముఖ్యమైన జీవన సూత్రాలపై ఒకసారి విశ్లేషణగా చూద్దాం.
వివరాలు
1.బాగా కష్టపడటం…
ఏది సులభంగా దక్కదు. ప్రతి విజయానికీ కష్టమే పునాది. శ్రమకు భయపడకుండా దానిలో నిబద్ధతతో పాల్గొనాలి. మనం లక్ష్యాన్ని చేరుకోవాలనుకుంటే ఎన్నో అడ్డంకులు వస్తాయి. అప్పుడప్పుడు నిరాశ కలుగవచ్చు, ఓటములు ఎదురవుతాయి. అయితే, ఇవన్నీ సాధారణమే. వాటిని అధిగమించాలంటే ఒక్కసారితో సరిపోదు - పదిసార్లు ప్రయత్నించాల్సి ఉంటుంది. విజయం మనకు చేరువ అవ్వాలంటే నిరంతర శ్రమ అవసరం.
వివరాలు
2.నిజాయితీ ..
దారిలో మోసాలు, అబద్ధాలతో ఎదగాలని అనుకోవడం సరైంది కాదు. నిజాయితీతో నడుచుకుంటేనే విశ్వాసం పెరుగుతుంది. లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఎవరి సహకారాన్ని అయినా స్వీకరించేందుకు సిద్ధంగా ఉండాలి. అవసరమైన సమాచారం ముందుగానే సేకరించాలి. అలా సమగ్రంగా సన్నద్ధమైతే ఎదుగుదల తప్పదు.
వివరాలు
3.ప్రణాళిక..
ఏ పనికైనా ముందు ప్రణాళిక అవసరం. ఆ ప్రణాళికను గోప్యంగా ఉంచాలి. మీరు ఎటువంటి పని చేయాలనుకున్నా, అది పూర్తయ్యే వరకు ఇతరులకు తెలియనీయకపోవడం మేలైనది. మీరు మీ ప్రణాళికను ఎంత రహస్యంగా ఉంచుకుంటే, మీరు అంత సులభంగా విజయం సాధిస్తారు. మీ యత్నాల గురించి అహంకారంగా మాట్లాడకుండా, దానిని నిశ్శబ్దంగా కొనసాగించాలి. ఇది ఎప్పటికీ గుర్తుంచుకోవలసిన విషయమే. చాణక్యుడు సూచించిన ఈ మూడు జీవన సూత్రాలు - కృషి, నిజాయితీ, ప్రణాళిక - ఎవరు సుదీర్ఘంగా ఆచరిస్తారో వారు తమ జీవిత ప్రయాణంలో తప్పకుండా విజయవంతమవుతారు. జీవితంలో ఎదగాలనుకునే ప్రతి ఒక్కరు ఈ మంత్రాలను ఆచరణలో పెట్టాలి.