ఇంటి గోడలకు ఇంకా రంగు వేస్తున్నారా? రంగు లేకుండా కొత్తగా ఇలా ట్రై చేయండి
గోడలకు రంగువేయడం అనేది చాలా సాధారణమైన విషయం. ఇంటిని కళాత్మకంగా చేయడానికి రకరకాల పెయింటింగ్స్ వాడతారు. కానీ ఇప్పుడు అది పాత పద్దతిగా మారిపోయింది. రంగులేకుండా మీ ఇంటి గోడలను అందంగా మార్చుకోవచ్చు. రంగుకు ప్రత్యామ్నాయం మార్కెట్లో చాలా ఉన్నాయి. రంగు లేకుండా గోడలను అందంగా ఎలా తయారుచేసుకోవచ్చో చూద్దాం. గ్యాలరీ వాల్: మీ ఇంటి గోడలకు మీకు సంబంధించిన ఫోటో గ్యాలరీలతో నింపివేయండి. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ లేదా మీకు నచ్చిన ఆర్ట్ వర్క్ తో గ్యాలరీ తయారు చేయండి. వాల్ పేపర్: మీ గోడల మీద పెయింటింగ్ తో వేయించే వాల్ పేపర్స్ కాకుండా అవసరం అయినప్పుడు మార్చేసే వీలుండే తాత్కాలిక వాల్ పేపర్స్ వాడండి.
మరిన్ని ఐడియాలు
మ్యాప్: మీ ఇంటి గోడను వరల్డ్ మ్యాప్ తో నింపేయండి. ఆ తర్వాత దానిలో మీరు ఏయే ప్రాంతాలు చూడాలనుకుంటున్నారో రోజూ చెక్ చేసుకుంటూ ఉండండి. దానివల్ల మీకు మంచి ఉత్సాహం వస్తుంది. టైల్స్: సాధారణంగా మనం కిచెన్ లో, బాత్రూమ్ లో టైల్స్ వేసుకుంటాం. గోడలకు కూడా వీటిని వాడవచ్చు. వీటిని శుభ్రం చేయడం చాలా తేలిక. ఫ్యాబ్రిక్: ఈ మధ్య వీటిని ఎక్కువగా వాడుతున్నారు. దళసరి బట్టతో గోడను కప్పేస్తే లోపలున్న వారికి వెచ్చగా ఉంటుంది. ఇంకా గోడకు కొత్త స్టైల్ వస్తుంది. ఈ ఫ్యాబ్రిక్స్ లో మంచి డిజైన్స్ ఉంటాయి. ఆన్ లైన్ లో వెతికితే సులభంగా దొరుకుతాయి. మీ ఇంటి గోడలకు పెయింట్ వాడకుండా కళాత్మకంగా తీర్చిదిద్దుకోండి.