LOADING...
Bitter Gourd : ఆరోగ్యానికి మేలు చేసే కాకరకాయ… కానీ ఈ పొరపాటు అస్సలు చేయొద్దు!
ఆరోగ్యానికి మేలు చేసే కాకరకాయ… కానీ ఈ పొరపాటు అస్సలు చేయొద్దు!

Bitter Gourd : ఆరోగ్యానికి మేలు చేసే కాకరకాయ… కానీ ఈ పొరపాటు అస్సలు చేయొద్దు!

వ్రాసిన వారు Moogati Shabari
May 02, 2026
11:16 am

ఈ వార్తాకథనం ఏంటి

కాకరకాయ రుచికి చేదుగా ఉన్నప్పటికీ, ఇందులో విటమిన్ C, ఐరన్, జింక్, పొటాషియం, మాంగనీస్ వంటి అనేక ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్న వారికి ఇది ఔషధంలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా బరువు తగ్గడంలో, కొలెస్ట్రాల్ నియంత్రణలో కూడా ఇది సహాయపడుతుంది. అయితే కొన్ని ఆహారాలతో కలిపి కాకరకాయను తీసుకుంటే, దాని పూర్తి లాభాలు దక్కకపోవడమే కాకుండా, కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశముందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వివరాలు

కాకరకాయ జ్యూస్ తాగాక ఇలా అస్సలు చేయకండి..

పాలు: పాలు సాధారణంగా ఆరోగ్యానికి మంచివే. కానీ కాకరకాయ కూర తిన్న వెంటనే లేదా కాకరకాయ జ్యూస్ తాగిన తర్వాత పాలు తాగడం మంచిది కాదు. ఇలా చేస్తే మలబద్ధకం, కడుపులో మంట వంటి సమస్యలు రావచ్చు. అందువల్ల కాకరకాయ తీసుకున్న వెంటనే పాలు తాగకుండా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. మామిడి పండు: వేసవి కాలంలో మామిడి పండ్లు ఎక్కువగా తింటారు. అయితే కాకరకాయతో కలిసి మామిడి తినడం సరైంది కాదు. ఈ కలయిక జీర్ణక్రియను ప్రభావితం చేసి అసిడిటీ, కడుపులో మంట, వికారం వంటి సమస్యలకు దారితీయవచ్చు.

వివరాలు

వీటితో కలిపి తీసుకోవడం మంచిది కాదు..

పెరుగు, బెండకాయ: పెరుగు, కాకరకాయ వేర్వేరుగా ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ, వీటిని కలిపి తీసుకోవడం మంచిది కాదు. ఇలా చేస్తే చర్మ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అలాగే బెండకాయను కూడా కాకరకాయతో కలిపి తినడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తి, కడుపు అసౌకర్యం కలగవచ్చు. ముల్లంగి: కాకరకాయ తిన్న తర్వాత ముల్లంగి తినకూడదు. ఈ రెండు పదార్థాల స్వభావం భిన్నంగా ఉండటంతో జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఫలితంగా కఫం పెరగడం, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. అందువల్ల కాకరకాయలోని అన్ని పోషకాలు, ప్రయోజనాలు పొందాలంటే పై చెప్పిన ఆహార పదార్థాలతో కలిపి తీసుకోవడం మానుకోవడం ఉత్తమం.

Advertisement