
ఒంటరిగా డ్యాన్స్ చేసే అలవాటు మీకుందా? అది ఆరోగ్యానికే చేసే మేలు తెలుసుకోండి
ఈ వార్తాకథనం ఏంటి
మీ గదిలో ఒంటరిగా డ్యాన్స్ చేస్తున్నారా? కంగారు పడకండి, అదేమీ తప్పు విషయం కాదు. లోకాన్నే మర్చిపోతూ చేసే డ్యాన్స్ వల్ల మీరు ప్రశాంతంగా మారతారు. ఒంటరిగా డ్యాన్స్ చేయడం వల్ల ఏం జరుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం.
డ్యాన్స్ అనేది వ్యాయామానికి ప్రత్యామ్నాయంలా పనిచేస్తుంది. మీకు బాగా బోరింగ్ గా అనిపించినపుడు డ్యాన్స్ చేయండి. దానివల్ల శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది. బరువు తగ్గుతారు. గుండె సంబంధిత వ్యాధులు దరిచేరవు.
ఆవేశాల్ని తగ్గిస్తుంది: రోజువారి జీవితంలో ఉండే సమస్యలను మర్చిపోయేలా చేసి నెగెటివ్ ఆలోచనలను దూరం చేస్తుంది.
దానివల్ల కోపం, బాధ, వంటి ఆవేశాలు తగ్గుతాయి. డ్యాన్స్ వల్ల మీ మెదడులోని కొన్ని ప్రాంతాలు యాక్టివేట్ అవుతాయి. దానివల్ల మీరు ప్రశాంతంగా ఉంటారు.
మానసిక ఆరోగ్యం
ఆత్మవిశ్వాసాన్ని పెంచి యాంగ్జయిటీని తగ్గించే డ్యాన్స్
డ్యాన్స్ చేస్తున్నప్పుడు శరీరంలో మనసును ఉల్లాసపరిచే హార్మోన్లు రిలీజ్ అవుతాయి. అందులో డోపమైన్ ఒకటి. ఈ హార్మోన్ కారణంగా మనసు, శరీరం ప్రశాంతంగా మారుతుంది. అందుకే కోపం వచ్చినపుడు డ్యాన్స్ చేయండి.
ఒంటరిగా డ్యాన్స్ చేయడం వల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎవరూ చూడట్లేదన్న ఫీలింగ్ తో, మిమ్మల్ని మీరు నిజాయితీగా చూసుకుంటారు.
డ్యాన్స్ చేస్తున్నప్పుడు రకరకాలుగా బాడీ కదులుతుంది. వంగడం, లేవడం, పక్కకు జరగడం చేయడం వల్ల మీ శరీర శక్తి పెరుగుతుంది. అలాగే మీ శరీర బ్యాలన్స్ ఇంప్రూవ్ అవుతుంది. శరీర కండరాలు దృఢంగా మారడం వల్ల దిట్టంగా తయారవుతారు.
ఖాళీ దొరికినప్పుడు, కోపం వచ్చినపుడు, బోర్ అనిపించినపుడు డ్యాన్స్ చేయడం మర్చిపోకండి.