నరాల బలహీనత వల్ల కాళ్ళలో వణుకు పుడుతుందా? ఈ యోగాసనాలు ప్రయత్నించండి
యోగా వల్ల మీ మనసు ప్రశాంతంగా మారడమే కాదు మీ కండరాలకు బలం చేకూరి శరీరానికి శక్తి అందుతుంది. ఇంకా బరువు తగ్గడంలో యోగా చాలా హెల్ప్ చేస్తుంది. కొన్ని యోగాసనాల వల్ల మన నాడీవ్యవస్థ బలంగా తయారవుతుంది. నరాలు బలంగా ఉన్నప్పుడు ఒత్తిడి, యాంగ్జాయిటీ వంటివి మనకు దూరమవుతాయి. నరాల బలహీనత వల్ల కాళ్ళలో వణుకు, చేతులు వణకడంలాంటి సమస్యలు వస్తాయి. వాటిని దూరం చేసుకోవడానికి పనికొచ్చే యోగాసనాలు ఇక్కడ తెలుసుకుందాం. బాలాసనం: మోకాళ్ళతో నేలమీద కూర్చుని, కాలి మడమల మీద పిరుదులను ఆనించి, నెమ్మదిగా కిందకు వంగుతూ నుదురును నేలకు ఆనించాలి. ఇలా 20 నుండి 30 సెకన్లు ఉండాలి.
నరాలకు బలం చేకూర్చే యోగాసనాలు
వృక్షాసనం: నిటారుగా నిలబడి కుడికాలును నెమ్మదిగా పైకి లేపి ఎడమ కాలు తొడమీద కుడికాలు పాదాన్ని ఉంచాలి. రెండు చేతులను ఆకాశంలోకి తీసుకెళ్ళి నమస్కారం చేయాలి. మకరాసనం: బోర్లా పడుకుని పొట్టను నేలకు ఆనించి మోచేతులను నేలకు తగిలేలా ఉంచి రెండు చేతులతో రెండు చెంపలను పట్టుకోవాలి. దీనివల్ల వెన్నెముక, భుజాల్లో బలం పెరుగుతుంది. శవాసనం: వెల్లకిలా పడుకుని చేతులను కూడా వెల్లకిలా భూమి మీద ఆనించాలి. అరచేతులు ఆకాశం వైపు చూడాలి. శరీరమంతా విశ్రాతి తీసుకుంటున్నట్టుగా ఉండాలి. దీనివల్ల ఒత్తిడి, యాంగ్జాయిటీ దూరమవుతుంది. అధోముఖ శవాసనం: నిటారుగా నిలబడి ముందుకు వంగి చేతులతో భూమిని తాకాలి. మీ నడుము భాగం పైకి కనపడాలి. 10-15సెకన్లు ఉంటే సరిపోతుంది.