LOADING...
Tomato Methi Soya Curry: నోటికి కొత్త రుచి.. సింపుల్ స్టెప్స్‌తో టమోటా మెంతి సోయా కర్రీ
నోటికి కొత్త రుచి.. సింపుల్ స్టెప్స్‌తో టమోటా మెంతి సోయా కర్రీ

Tomato Methi Soya Curry: నోటికి కొత్త రుచి.. సింపుల్ స్టెప్స్‌తో టమోటా మెంతి సోయా కర్రీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 16, 2026
01:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

టమోటాలు అనేక రకాల వంటల్లో కీలక పాత్ర పోషిస్తాయి. పచ్చడి, పప్పు, రసం మాత్రమే కాకుండా ఇతర కూరగాయలతో కలిపి రుచికరమైన కాంబినేషన్ కర్రీలు కూడా తయారు చేస్తారు. అలాంటి ప్రత్యేకమైన వంటకాలలో ఒకటే 'టమోటా మెంతి సోయా కర్రీ'. ఇప్పుడు చెప్పబోయే విధంగా చేస్తే తిన్నవారు 'సూపర్' అనాల్సిందే. కొత్తగా ప్రయత్నించే వారు కూడా ఈ స్టెప్స్‌ ఫాలో అయితే పర్ఫెక్ట్‌గా వస్తుంది. ముఖ్యంగా రైస్‌, పులావ్‌, చపాతీ, రోటీలకు అద్భుతంగా సరిపోతుంది.

Details

కావాల్సిన పదార్థాలు

సోయా గ్రాన్యూల్స్ - పావు కప్పు నూనె - 5 టేబుల్ స్పూన్లు జీలకర్ర - అర టీ స్పూన్ కరివేపాకు - కొద్దిగా పచ్చిమిర్చి - 2 ఉల్లిపాయ తరుగు - ఒక కప్పు మెంతికూర - 2 కప్పులు టమోటాలు - 5 అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీ స్పూన్ కారం - 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి - 1 టీ స్పూన్ పసుపు - అర టీ స్పూన్ జీలకర్ర పొడి - 1 టీ స్పూన్ కొత్తిమీర - కొద్దిగా గరం మసాలా - పావు టీ స్పూన్

Details

తయారీ విధానం

1. ముందుగా ఒక గిన్నెలో పావు కప్పు సోయా గ్రాన్యూల్స్ వేసి సరిపడా వేడి నీళ్లు పోసి 15 నిమిషాల పాటు నానబెట్టాలి/ఉడికించాలి. 2. మెంతికూర, ఉల్లిపాయలు, ఐదు టమోటాలు, రెండు పచ్చిమిర్చిని తరిగి పెట్టుకోవాలి. టమోటాల్లో కొంత భాగాన్ని మిక్సీ జార్‌లో వేసి పేస్ట్‌గా గ్రైండ్ చేసుకోవాలి. 3. స్టవ్‌పై కడాయి పెట్టి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడైన తర్వాత సోయా గ్రాన్యూల్స్ వేసి సుమారు రెండు నిమిషాలు వేయించి ప్లేట్‌లోకి తీసేయాలి. 4. అదే కడాయిలో మిగిలిన నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. అందులో అర టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసి వేయించాలి.

Advertisement

Details

తయారీ విధానం1/2

5. వెంటనే ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి ముక్కలు వేసి కలపాలి. మూతపెట్టి మధ్యమధ్యలో కలుపుతూ సుమారు 8 నిమిషాలు ఉల్లిపాయలు మగ్గే వరకు వేపాలి. 6. ఉల్లిపాయలు మెత్తబడిన తర్వాత రెండు కప్పుల మెంతికూర వేసి మరో 8 నిమిషాలు ఫ్రై చేయాలి. ఆపై అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించాలి. 7. ఈ మిశ్రమం బాగా వేపిన తర్వాత కారం, ధనియాల పొడి, పసుపు, జీలకర్ర పొడి వేసి పావు కప్పు నీరు పోసి కలపాలి. నూనె పైకి తేలే వరకు బాగా ఫ్రై చేయాలి. 8. ఇప్పుడు గ్రైండ్ చేసిన టమోటా పేస్ట్ వేసి కలిపి సుమారు

Advertisement

Details

చపాతీతో సర్వ్ చేసుకుంటే బాగుంటుంది

8 నిమిషాలు మగ్గనివ్వాలి. 9. అనంతరం వేయించిన సోయా గ్రాన్యూల్స్, ఒక కప్పు నీళ్లు, తరిగిన టమోటా ముక్కలు వేసి కలిపి మూతపెట్టి మరో 8 నిమిషాలు మగ్గించాలి. 10. చివరగా కొత్తిమీర తరుగు, పావు టీ స్పూన్ గరం మసాలా వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇంతే... ఘుమఘుమలాడే టమోటా మెంతి సోయా కర్రీ సిద్ధం! వేడి వేడి అన్నం, పులావ్‌, చపాతీ, రోటీలతో సర్వ్ చేస్తే రుచి మరింత పెరుగుతుంది.

Advertisement