సపోటా లాంటి ఈ పండు వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్
అబియూ ఫ్రూట్, దక్షిణ అమెరికా, పెరూ, కొలంబియా, బ్రెజిల్, వెనిజులా దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ పండును ఒక్కో దేశంలో ఒక్కోలా పిలుస్తారు. సపోటా పండు జాతికి చెందిన ఈ పండు అచ్చం సపోటా లానే ఉండి కోడిగుడ్డు ఆకారంలో కనిపిస్తుంది. కాయగా ఉన్నప్పుటి కంటే పండినపుడు బంగారు వర్ణంలో మెరిసిపోతూ ఉంటుంది. ఈ పండు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. చాలామంది దీన్ని తినడానికి ఇష్టపడరు. కారణం, ఆ పండు తినేటప్పుడు దానిలోని జిగురుదనం వల్ల పెదాలు అంటుకుపోతాయి. ఇకపోతే ఈ పండుని సలాడ్లలో, జామ్ లలో, నిమ్మరసంలో కలుపుకుని సేవిస్తారు. జిగురుదనం పెదాలకి అంటుకోకుండా పెదాలకి నూనె రాసుకుని మరీ దీన్ని తింటారు.
హెల్త్ బెనిఫిట్స్
టమాటలు, క్యారెట్లలో లాగే విటమిన్ A దీనిలో ఎక్కువగా ఉంటుంది. అందువల్ల కంటికి వచ్చే వ్యాధులు దూరం అవుతాయి. కంటిచూపు మెరుగుపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ C, ఇందులో పుష్కలంగా ఉంటుంది. దానివల్ల రుతువులు మారినప్పుడు అటాక్ చేసే చిన్న చిన్న వ్యాధులు దరిచేరవు. 100గ్రాముల అబియూ ఫ్రూట్ లో ఒకరోజుకి కావాల్సిన విటమిన్ సి లభిస్తుంది. విటమిన్ B3(నియాసిన్) అధికంగా అబియూ ఫ్రూట్ లో దొరుకుతుంది కావున చర్మ సమస్యలు, నాడీమండల సమస్యలు, జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి. జలుబు, దగ్గు, ఇతర శ్వాసకోస సంబంధిత వ్యాధులను దూరం చేయడంలో అబియూ ఫ్రూట్ చాలా మేలు చేస్తుంది. ఈ పండు మనదేశంలో కేరళ రాష్ట్రంలో లభిస్తుంది.