Holi 2025:హోలీ రంగులు సురక్షితమేనా? తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు!
ఈ వార్తాకథనం ఏంటి
హోలీ పండుగ వేళ సంబరాలు చేసుకోవాలి కానీ, ఆరోగ్యానికి హాని కలిగించుకోకూడదు. సింథటిక్ రంగుల వాడకం ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ రంగుల తయారీలో రాగి, సిలికా, సీసం, ఆర్సెనిక్ వంటి హానికరమైన రసాయనాలతో పాటు మైకా, గాజు కణికలు, ఆస్బెస్టాస్ వంటి పదార్థాలు కూడా కలిసుంటాయి.
ఇవి చర్మానికి హాని చేయడంతో పాటు శ్వాసనాళాలకు, కళ్లకు ప్రమాదకరమని నిపుణులు సూచిస్తున్నారు. ఒకప్పుడు హోలీ రంగులు మోదుగు పూలతో సహజ రీతిలో తయారయ్యేవి.
ముగ్గు పిండిలో కలిపిన రంగులను నీటిలో కలిపి వినియోగించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.
మార్కెట్లో విపరీతంగా లభిస్తున్న విషపూరిత రంగులు ప్రమాదాలను పెంచుతున్నాయి.
Details
నమస్తే
సింథటిక్ రంగుల వల్ల చర్మం, కంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
నేత్ర వైద్యులు సూచించిన జాగ్రత్తలు పాటించకపోతే, కొన్ని సందర్భాల్లో చూపు కోల్పోయే ప్రమాదం కూడా ఉందంటున్నారు.
హోలీ సమయంలో ముఖానికి నేరుగా రంగులు చల్లకుండా ఉండాలి. కళ్లల్లో రంగులు పడితే వాటిని గట్టిగా రుద్దకూడదు. అలా చేస్తే కంటి పొరల్లో రాపిడి జరిగి కార్నియా దెబ్బతినే అవకాశం ఉంది.
కళ్లను శుభ్రపరిచినప్పటికీ సమస్య కొనసాగితే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
హోలీ రంగుల కారణంగా చర్మ అలర్జీలు కూడా వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి, ఈ హోలీ పండుగను హానిరహితమైన సహజ రంగులతో జరుపుకోండి. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, నిజమైన ఆనందాన్ని పొందండి!