గోవా వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారా? బీచ్ లో ఎలాంటి డ్రెస్సెస్ వేసుకోవాలో తెలుసుకోండి
గోవా వెళ్ళాలన్న కోరిక ప్రతీ ఒక్కరి కోరికల లిస్టులో ఉంటుంది. బీచ్ లో హ్యాపీగా తిరుగుతూ ప్రపంచాన్ని మైమర్చిపోయి సముద్రాన్ని చూస్తూ ఉండాలనిపిస్తుంటుంది. దానికోసం ప్రత్యేకమైన డ్రెస్సెస్ ఉంటే బాగుంటుంది. మరి బీచ్ లో ఎలాంటి డ్రెస్సెస్ బాగుంటాయో చూద్దాం. ముఖ్యంగా అమ్మాయిలు ఎలాంటి ఫ్యాషన్ ని ఫాలో కావాలో తెలుసుకోండి. మీకలానే అనిపిస్తుందా? ఐతే గోవా వెళ్తే ఎలాంటి డ్రెస్సెస్ వేసుకోవాలో తెలుసుకోండి. ఎందుకంటే బీచ్ లో మనం సాధారణంగా వేసుకునే డ్రెస్సెస్ సెట్ కావు. క్రాప్ టాప్, ప్రింటెడ్ షార్ట్స్:బీచ్ లో షార్ట్స్ ని మించిన స్టైల్ లేనే లేదు. షార్ట్స్ లో మీ లుక్ మరింత బాగా కనబడాలంటే స్లీవ్ లెస్ క్రాప్ టాప్ బాగుంటుంది.
బీచ్ లో సౌకర్యంగా ఉండే డ్రెస్సెస్
మ్యాక్సి డ్రెస్: మ్యాక్సి డ్రెస్ చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. పొడవుగా ఉంటుంది కాబట్టి సూర్యుడి వేడి మీ ఒంటికి డైరెక్టుగా తగలదు. దానివల్ల మీ చర్మం నల్లబడదు. ఉదయం, సాయంత్రం ఎప్పుడైనా ఈ డ్రెస్ వేసుకోవచ్చు. మ్యాక్సిడ్రెస్ లో మీ లుక్ ని మరింత ఆకర్షణీయంగా కనిపించాలంటే తలకు క్యాప్ తగిలించండి. బాడీసూట్ సరాంగ్: బికినీ వేసుకోవడం మీకు ఇబ్బందిగా ఉంటే బాడీసూట్ ధరించండి. బాడీసూట్ పైన సరాంగ్ ధరిస్తే మరింత ఫ్రెష్ లుక్ వస్తుంది. వైట్ రోంపర్: వేసవిలో బీచ్ కి వెళ్ళాలనుకునే వారికి వైట్ రోంపర్ డ్రెస్ సరిగ్గా సరిపోతుంది. ఇవి చాలా సౌకర్యవంతంగా ఉంటాయి.