బనారస్ పాన్, లాంగ్డా మామిడి రకానికి జీఐ ట్యాగ్
ఉత్తరప్రదేశ్ కు చెందిన బనారస్ పాన్, లాంగ్డా మామిడి రకానికి ఏప్రిల్ 3వ తేదీన జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ దక్కింది. ఇవేకాదు ఉత్తరప్రదేశ్ కు చెందిన చాలా వస్తువులకు జీఐ ట్యాగ్ అందింది. అలీఘర్ తాళాలు, బకీరా ఇత్తడి వస్తువులు, బంద షాజర్ రాతి కళాకృతులు, హత్రాస్ ఇంగువ, నగీన కలప కళాకృతులు, ప్రతాప్ ఘర్ ఉసిరికి జీఐ ట్యాగ్ అందింది. జీఐ ట్యాగులు అత్యధికంగా అందించుకున్న రాష్ట్రాల్లో కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, కేరళ ఉన్నాయి. ఈసారి మొత్తం 33వస్తువులకు జీఐ ట్యాగ్ అందింది. మొత్తం భారతదేశంలో జీఐ ట్యాగ్ కలిగిన ఉన్న వస్తువుల సంఖ 441గా ఉంది. జీఐ ట్యాగ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం చెన్నైలో ఉంది.
జీఐ ట్యాగ్ వల్ల కలిగే ప్రయోజనాలు
జీఐ ట్యాగ్ కారణంగా చాలా ప్రయోజనాలున్నాయి. ఒక ప్రోడక్టుకు ప్రత్యేకమైన గుర్తింపు రావడమే కాకుండా, ఆ ప్రోడక్టు ఏ ప్రాంతానికి చెందినదో ఆ ప్రాంతానికి కూడా గుర్తింపు వస్తుంది. జీఐ ట్యాగ్ వచ్చిన ప్రోడక్టును ఇతర ప్రాంతాల వారు తయారు చేయడానికి వీలులేదు. అది ఆ ప్రాంతానికే సొంతం. జీఐ ట్యాగ్ వచ్చిన వస్తువులకు ఈ విషయంలో చట్టబద్దమైన సాయం ఉంటుంది. ఈ ట్యాగ్ వచ్చిన వస్తువులకు వాటి ఆకృతిలో గానీ, రుచిలో గానీ నాణ్యతలో గానీ ప్రత్యేకత ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో తిరుపతి లడ్డూకు, హైదరాబాద్ హలీమ్ కు 2010లో జీఐ ట్యాగ్ వచ్చింది. నిర్మల్ కొయ్యబొమ్మలకు 2009లో వచ్చింది.