
పండగ: రంజాన్ సంబరాన్ని మరింత పెంచే గిఫ్ట్ ఐడియాస్
ఈ వార్తాకథనం ఏంటి
రంజాన్ పండగ అంటే ఉపవాసాలు, ఇఫ్తార్ విందులు గుర్తొస్తాయి. 30రోజుల కఠిన ఉపవాసం తర్వాత ఈద్ ఉల్ ఫితర్ జరుపుకుంటారు. ఈ రోజున బంధువులను, స్నేహితులను ఇంటికి పిలుచుకుని పండగ సంబరాన్ని జరుపుకుంటారు.
ఐతే ఇంటికి వచ్చిన అతిధులకు ఆతిథ్యంతో పాటు బహుమతులు అందిస్తే పండగ సంబరం మరింత పెరుగుతుంది. ఎలాంటి బహుమతులు ఇవ్వాలో మీకు తెలియకపోతే ఇది చదవండి.
గిఫ్ట్ హ్యాంపర్స్:
అతిథులను సర్పైజ్ చేయాలనుకుంటే గిఫ్ట్ హ్యాంపర్స్ ఇవ్వండి. దీనిలో పర్ఫ్యూమ్స్, సెంటెడ్ క్యాండిల్స్, ఖర్జూరం ఉంటే వాళ్ళు థ్రిల్ ఫీలవుతారు.
స్వీట్ బాక్స్:
పండగ పూట తీపి పదార్థం కన్నా మంచి గిఫ్ట్ ఏముంటుంది. మీకు నచ్చిన స్వీటును ప్యాక్ చేసి బహుమతిగా ఇవ్వండి.
రంజాన్
పండగ పూట అతిథులను అబ్బురగొలిపే బహుమతులు
అలంకరణ సామాగ్రి:
పండగ పూట ఇంటిని అందంగా అలంకరిస్తే బాగుంటుంది. మీ అతిధులకు ఇంటి అలంకరణ సామాగ్రిని బహుమతిగా ఇవ్వండి. లాంతర్లు, బెలూన్లు, అలంకరన దీపాలు అందించండి.
ఇస్లాం కళాకృతులు:
ఇస్లాం సాంప్రదాయానికి చెందిన కళాకృతులను బహుమతిగా అందిస్తే అతిధులు అద్భుతంగా ఫీలవుతారు. ఖురాన్ కు సంబంధించిన కళాకృతులు అందించండి.
గిఫ్ట్ కార్డ్ :
అతిథులందరినీ ఆలోచింపజేయాలని మీకనిపిస్తే, మీకు మీరే ఒక గిఫ్ట్ కార్డ్ తయారు చేయండి. గిఫ్ట్ కార్డ్ మీద పండగ గురించి వాక్యాలు రాసి వాళ్ళకు అందించండి.
మెమెంటో:
పండగకు సంబంధించిన మెమెంటోలను బహుమతిగా అందిస్తే బాగుంటుంది. ప్రతీ పండక్కి గుర్తుండడంతో పాటు మీపట్ల వారి ప్రేమ మరింత పెరుగుతుంది.