Self confidence: తమ మీద తమకు నమ్మకం ఉన్నవారి లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకోండి
ఒక వ్యక్తి కాన్ఫిడెంట్ గా ఉన్నాడని నువ్వు ఎలా చెప్పగలవు. అసలు కాన్ఫిడెంట్ గా ఉండే మనిషి ఎలా ఉంటాడు? అతని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? ప్రస్తుతం ఆత్మవిశ్వాసం గల వ్యక్తుల లక్షణాలు ఎలా ఉంటాయో ఇక్కడ తెలుసుకుందాం. స్పష్టమైన కమ్యూనికేషన్: కాన్ఫిడెంట్ పర్సన్స్ ఇతరులతో చాలా స్పష్టంగా మాట్లాడుతారు. సమాధానం ఇస్తారు. అనవసర సందేహాలు మనసులో పెట్టుకోకుండా మాట్లాడుతారు. నిర్ణయాలు తొందరగా తీసుకుంటారు: తమ మీద తమకు నమ్మకం కలిగిన వాళ్ళు నిర్ణయాలను తొందరగా తీసుకుంటారు. ఆ తర్వాత ఏం జరుగుతుందోనన్న సందేహంతో నిర్ణయాలను తీసుకోవడంలో ఆలస్యం చేయరు. ఏది జరిగినా ఎదుర్కొంటానన్న నమ్మకంతో ఉంటారు.
రిస్క్ తీసుకుంటారు
తమకు మంచి ఫలితాన్ని అందించే రిస్కులను తీసుకోవడానికి కాన్ఫిడెంట్ పర్సన్స్ వెనుకాడరు. ఏదో అవుతుందన్న భయం వీళ్ళలో ఉండదు. తమకున్న జ్ఞానంతో, సామర్థ్యంతో రిస్కులను సైతం ఎదుర్కొంటారు. నో చెప్పడానికి వెనకాడరు: కాన్ఫిడెంట్ పర్సన్స్ స్పష్టంగా మాట్లాడతారని ముందే చెప్పుకున్నాం. వీళ్లు తమవల్ల కాని పనిని కాదని చెప్పేస్తారు. నో చెప్పడానికి అస్సలు వెనుకాడరు. అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలన్న ఆలోచనతో వీరు ఉంటారు. బాధ్యతగా ఉంటారు: తమ మీద తమకు నమ్మకం ఎక్కువగా ఉన్నవారు బాధ్యతగా ఉంటారు. బాధ్యతలు తీసుకోవడానికి ముందుకి వస్తారు. తమకు ఇచ్చిన బాధ్యతల్ని పూర్తి చేయడానికి కృషి చేస్తారు.