NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / అందం: పొడిబారిన ముఖానికి మేకప్ వేసుకోవడం కష్టంగా ఉంటే ఇలా చేయండి
    తదుపరి వార్తా కథనం
    అందం: పొడిబారిన ముఖానికి మేకప్ వేసుకోవడం కష్టంగా ఉంటే ఇలా చేయండి
    చర్మం పొడిబారిపోయే సమస్య ఉన్నవాళ్ళు మేకప్ వేసుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు

    అందం: పొడిబారిన ముఖానికి మేకప్ వేసుకోవడం కష్టంగా ఉంటే ఇలా చేయండి

    వ్రాసిన వారు Sriram Pranateja
    Apr 03, 2023
    11:08 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ముఖం మీద చర్మం పొడిబారినట్లయితే మేకప్ వేసుకోవడం కష్టంగా మారుతుంది. చనిపోయిన చర్మకణాల కారణంగా ముఖం మీద మేకప్ సరిగా అంటదు.

    ఇలాంటప్పుడు మీరు మేకప్ వేస్తే, అది అతుకులుగా కనిపించి అసహ్యంగా ఉంటుంది. మరి చర్మం పొడిబారడం అనే సమస్యతో బాధపడేవారు మేకప్ ని ఎలా వేసుకుంటే బాగుంటుందో చూద్దాం.

    మీ చర్మాన్ని ప్రిపేర్ చేయండి:

    క్లీన్సర్ తో మీ చర్మాన్ని ముందుగా శుభ్రపరచండి. అంటే చనిపోయిన చర్మ కణాలపై కలబంద రసం కలిగిన స్క్రబ్ తో రుద్ది శుభ్రపర్చండి. ఆ తర్వాత హ్యాలురోనిక్ ఆసిడ్ ఉన్న మాయిశ్చరైజర్ ని ముఖానికి మర్దన చేయండి.

    ముఖ్యంగా ముక్కు మీద మర్దన చేయండి. ముక్కు, దాని చుట్టు పక్కల భాగాలే తొందరగా పొడిబారిపోతాయి.

    మేకప్

    పొడిబారిన చర్మం ఉన్నవాళ్ళు మేకప్ వేసుకోవడానికి చేయాల్సిన పనులు

    ప్రైమర్, ఫౌండేషన్ అప్లై చేయండి:

    చర్మాన్ని శుభ్రపర్చిన తర్వాత మేకప్ ప్రైమర్ ని ముఖానికి వాడండి. ఆ తర్వాత లిక్విడ్ ఫౌండేషన్ ని ఉపయోగిస్తే మేకప్ సరిగ్గా అంటుతుంది. ఫౌండేషన్ ని అప్లై చేసేటపుడు స్పాంజ్ ఉపయోగించండి. చేతులను ఉపయోగిస్తే అతుకులుగా ఉంటుంది.

    కాన్సీలర్ తో మేకప్ ని సెట్ చేయండి:

    ఫౌండేషన్ పూర్తి కాగానే లిక్విడ్ లేదా క్రీమ్ కాన్సీలర్ ని ముఖం మీద, మచ్చలు కనిపిస్తున్న ప్రదేశాల్లో, నల్లని వలయాలుండే ప్రాంతాల్లో అప్లై చేయండి. దీని తర్వాత పౌడర్ లాంటివి పూయకుండా ఉంటే మంచిది.

    ఐ మేకప్:

    ముఖ భాగాలు పూర్తికాగానే కళ్ళ దగ్గరకు రావాలి. ఐ లైనర్ తో అందంగా తయారు చేయండి. కనురెప్పలకు కొత్త అందం ఇవ్వండి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అందం

    తాజా

    Pawan Kalyan: రాజధానిపై కుట్రలు చేసిన వారిని విడిచిపెట్టం : పవన్‌ కళ్యాణ్ హెచ్చరిక పవన్ కళ్యాణ్
    ENG vs IND: ఇంగ్లాండ్‌ టూర్‌కు ముందు కీలక మార్పు.. భారత జట్టుకు కొత్త కోచ్ ఇంగ్లండ్
    Tragedy : బెంగళూరులో దారుణం.. సెక్స్‌కి నిరాకరించిందని.. బాలికను హత్య చేసి సూట్‌కేస్‌లో పడేశారు! బెంగళూరు
    Thuglife : దారుణంగా పడిపోయిన థగ్ లైఫ్‌ కలెక్షన్లు.. మూడ్రోజుల్లో ఎంతంటే? కమల్ హాసన్

    అందం

    రాపిడి వల్ల తొడల మధ్య కలిగే దురదతో పాటు ఇతర సమస్యలను దూరం చేసే టాల్కం పౌడర్ లైఫ్-స్టైల్
    కొనదేలిన ముక్కు కోసం లక్షలు ఖర్చు పెట్టకుండా ఈ విధంగా ట్రై చేయండి లైఫ్-స్టైల్
    పొద్దున్న వేసుకున్న మేకప్ సాయంత్రానికల్లా తొలగిపోతుంటే పాటించాల్సిన చిట్కాలు లైఫ్-స్టైల్
    అందం: అఫారెస్ట్ గ్రీన్ కాఫీ టోనింగ్ ఫేస్ మిస్ట్ రివ్యూ లైఫ్-స్టైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025