చర్మ సంరక్షణ: మంగు మచ్చలను పోగొట్టి మెరిసే చర్మాన్ని అందించే షియా బటర్
చర్మాన్ని సురక్షితంగా, అందంగా, మెరిసేలా ఉంచేందుకు మార్కెట్లో ప్రోడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి. అవన్నీ మీకు సంతృప్తిని ఇవ్వకపోతే ఇంట్లో దొరికే వస్తువులతో చర్మాన్ని అందంగా మార్చుకోవచ్చు. అలాంటి వాటిల్లో షియా బటర్ ఒకటి. షియా బటర్ ని వాడటం వల్ల మంగు మచ్చలు తొలగిపోతాయి. ఐతే దీన్ని చర్మానికి ఎలా వాడాలో ఇక్కడ తెలుసుకుందాం. మంగు మచ్చలను పోగొట్టడానికి పాటించాల్సిన పద్దతులు: ముందుగా షియా బటర్ తీసుకుని, దానికి ఒక టీ స్పూన్ తేనె, 4చుక్కల క్యారెట్ సీడ్ ఆయిల్, కొంత లావెండర్ ఆయిల్, 5చుక్కల జెరేనియం ఆయిల్, 3టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్ కలిపి మిశ్రమం చేసి మంగు మచ్చలున్న ప్రదేశంలో మర్దన చేయాలి.
మంగు మచ్చలను దూరం చేసే షియా బటర్
షియా బటర్ డైరెక్టుగా ముఖం మీద అప్లై చేసినా మంచి ఫలితాలే వస్తాయి. కాకపోతే ఎంతమొత్తంలో షియా బటర్ ని ముఖానికి పూసుకోవాలనేది తెలిసుండాలి. మరీ ఎక్కువగా షియా బటర్ ని పూసుకోవడం మంచిది కాదు. మంగు మచ్చలున్న ప్రదేశాల్లో షియా బటర్ ని డైరెక్టుగా అప్లై చేసుకోవచ్చు. షియా బటర్ ని ఉపయోగించే మరో పద్దతి: 3టేబుల్ స్పూన్ల షియా బటర్ తీసుకుని, కొంత ధన్యాల పొడి, కొంత శనగ పిండి, కొంత "విటమిన్ ఈ" ఆయిల్ ని కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక చిన్నడబ్బాలోకి తీసుకుని భద్రపర్చుకోండి. ఎప్పుడైతే ముఖం శుభ్రం చేసుకుంటారో ఆ టైమ్ లో, డబ్బాలోని మిశ్రమాన్ని ముఖానికి మర్దన చేసుకోండి.