LOADING...
Sharbat: వేసవిలో కూల్ కూల్‌గా షర్బత్.. ఒక్క గ్లాస్‌తో చల్లని అనుభూతిని పొందండిలా
వేసవిలో కూల్ కూల్‌గా షర్బత్.. ఒక్క గ్లాస్‌తో చల్లని అనుభూతిని పొందండిలా

Sharbat: వేసవిలో కూల్ కూల్‌గా షర్బత్.. ఒక్క గ్లాస్‌తో చల్లని అనుభూతిని పొందండిలా

వ్రాసిన వారు Moogati Shabari
Apr 19, 2026
12:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

వేసవి తీవ్రత పెరిగే సమయంలో దాహాన్ని తీర్చుకోవడానికి ప్రజలు చల్లని పానీయాల కోసం ఆశ్రయిస్తుంటారు. నిమ్మరసం, మజ్జిగ, వివిధ రకాల జ్యూసులు ఎప్పటిలాగే లభ్యమవుతున్నప్పటికీ, ఈ సీజన్‌లో ఒక ప్రత్యేకమైన పానీయం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అదే 'మొహబ్బత్ ఈ షర్బత్'. పేరు వినగానే ఆసక్తిని రేకెత్తించే ఈ డ్రింక్, రుచి చూసిన తరువాత మరింతగా గుర్తుండిపోయే అనుభూతిని ఇస్తోంది. వేసవిలో శరీరానికి చల్లదనాన్ని అందించే సహజమైన పానీయం ఇది.

వివరాలు

తయారీ విధానం ఇదే

'మొహబ్బత్ ఈ షర్బత్' తయారీ విధానం కూడా విశేషమే. చిక్కటి పాలు, రూఫ్ అఫ్జా సిరప్, సబ్జా గింజలు, పుచ్చకాయ ముక్కలు, ఐస్, క్రీమ్, పంచదార వంటి పదార్థాలను కలిపి ఈ పానీయాన్ని తయారు చేస్తారు. పెద్ద గిన్నెలో ముందుగా ఐస్ వేసి, దానిలో పాలు పోసి, రూఫ్ అఫ్జా జోడించి, తరువాత పుచ్చకాయ ముక్కలను కలిపి బాగా మిక్స్ చేస్తే రంగు, రుచి సమతుల్యంగా కలిసిన రుచికరమైన డ్రింక్ సిద్ధమవుతుంది. దాదాపు 10 లీటర్ల పానీయం తయారు చేయడానికి సుమారు అరగంట సమయం పడుతుంది.

వివరాలు

షర్బత్ వల్ల ఉపయోగాలివే..

వేసవి తాపం నుంచి ఉపశమనం పొందడానికి ఈ డ్రింక్ చాలా బాగా ఉపయోగపడుతుంది. రోజూ ఈ షర్బత్ తీసుకుంటే శరీరంలో వేడి తగ్గుతుంది. ప్రతి రోజూ ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండటానికి ఈ షర్బత్ అద్భుతంగా పనిచేస్తుంది. శరీరానికి కావాల్సిన పోషకాలను కూడా ఈ షర్బత్ అందిస్తుంది.

Advertisement