Ash Gourd juice: ఉదయాన్నే బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు
రోజూ ఉదయాన్నే ఆరోగ్యానికి హాని చేసే కెఫైన్ సంబంధిత పానీయాలు తాగుతున్నారా? లేదా ఆరోగ్యానికి మేలు చేసే ఇతర పానీయాలు తాగుతున్నారా? ఆరోగ్యానికి మేలు చేసే పానీయాల్లో, హెర్బల్ వాటర్, స్పైస్ వాటర్ జ్యూస్ ఉంటాయి. అయితే బూడిద గుమ్మడి జ్యూస్ కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అవును, రోజూ ఉదయాన్నే బూడిద గుమ్మడికాయ రసం తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం. బూడిద గుమ్మడి కాయలో నీటిశాతం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల శరీరంలో విషపదార్థాలను బయటకు తొలగించడంలో ఇది తోడ్పడుతుంది. ఇది దాహాన్ని తీరుస్తుంది. బూడిద గుమ్మడికాయలో నీరు ఎక్కువగా ఉంటుంది కాబట్టి డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది.
బూడిద గుమ్మడి కాయ జ్యూస్ వల్ల కలిగే ప్రయోజనాలు
బీపీని నియంత్రణలో ఉంచుతుంది: బూడిద గుమ్మడికాయలోని పొటాషియం కారణంగా బీపీ కంట్రోల్ లో ఉంటుంది. దీనివల్ల గుండె సంబంధ సమస్యలు రాకుండా ఉంటాయి. చర్మ సంరక్షణ: విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి కాబట్టి చర్మానికి రక్షణ అందుతుంది. జీర్ణసమస్యలను దూరం చేస్తుంది: బూడిద గుమ్మడి కాయ రసం తాగడం వల్ల జీర్ణ సంబంధ సమస్యలు దూరమవుతాయి. మలబద్దకం దూరమై ప్రశాంతంగా ఉంటుంది. బరువు తగ్గడంలో సాయపడుతుంది: బూడిద గుమ్మడి కాయలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా కడుపు నిండుగా ఉంటుంది. తక్కువగా తింటారు.