kakarakaya velluli karam: కాకరకాయ అంటే చేదు కాదు.. వెల్లుల్లి కారంతో సూపర్ టేస్టీ రెసిపీ!
ఈ వార్తాకథనం ఏంటి
కాకరకాయ అంటే చేదు రుచి గుర్తుకు వచ్చి చాలా మంది దాన్ని తినేందుకు వెనకడుగు వేస్తుంటారు. కానీ సరైన విధానంలో వండితే కాకరకాయ కూడా ఎంతో రుచిగా మారుతుందనే సంగతి చాలామందికి తెలియదు. ముఖ్యంగా వెల్లుల్లి కారం కాకరకాయ అస్సలు చేదుగా ఉండదు. పైగా ఒకసారి చేసి పెట్టుకుంటే నెల రోజుల వరకు నిల్వ ఉండే స్పెషల్ రెసిపీ ఇది. కేవలం అరగంట సమయం కేటాయిస్తే చాలు... వేడి వేడి అన్నంలోకి కాస్త నెయ్యి వేసుకుని తింటే నోరూరించే రుచి ఖాయం.
Details
కావాల్సిన పదార్థాలు
కాకరకాయలు - అర కేజీ
పసుపు - పావు స్పూన్
ఉప్పు - 1 స్పూన్
ధనియాలు - అర టేబుల్ స్పూన్
జీలకర్ర - అర స్పూన్
కారం - 2 స్పూన్లు
వెల్లుల్లి పాయలు - 8
ఎండు కొబ్బరి తురుము - 1 టేబుల్ స్పూన్
నూనె - తగినంత
ఉప్పు - రుచికి సరిపడా
కరివేపాకు - 1 రెమ్మ
Details
తయారీ విధానం
ముందుగా కాకరకాయలను శుభ్రంగా కడిగి, గుండ్రంగా కాస్త మందంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి.
వాటిలో పసుపు, ఉప్పు వేసి బాగా కలిపి 30 నిమిషాల పాటు పక్కన పెట్టాలి**. ఇలా చేయడం వల్ల కాకరకాయల్లోని చేదు నీళ్లు బయటకు వచ్చి చేదుతనం తగ్గిపోతుంది. ఫ్రై చేసినప్పుడు ముక్కలు కరకరలాడుతాయి.
ఇప్పుడు వెల్లుల్లి కారం తయారీకి మిక్సీలో ధనియాలు, జీలకర్ర వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. తర్వాత కారం, పొట్టు తీయని వెల్లుల్లి పాయలు, ఎండు కొబ్బరి తురుము వేసి మరోసారి గ్రైండ్ చేయాలి.
ఈసమయంలో కాకరకాయ ముక్కల్లో నీళ్లు ఊరుతాయి. వాటిని చేతితో పిండినీళ్లు పూర్తిగా తీసేసి పక్కన పెట్టాలి. స్టవ్ మీద కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి.
Details
తయారీ విధానం1/2
నూనె వేడెక్కిన తర్వాత కాకరకాయ ముక్కలను మీడియం ఫ్లేమ్‌లో వేయించాలి.
మధ్య మధ్యలో కలుపుతూ నెమ్మదిగా వేయించాలి. మంట ఎక్కువ చేస్తే ముక్కలు కాలిపోయే అవకాశం ఉంటుంది. అలాగే మూత పెట్టి కుక్ చేయకూడదు.
కాకరకాయ ముక్కలు బాగా వేగిన తర్వాత, ముందుగా సిద్ధం చేసుకున్న వెల్లుల్లి కారం, రుచికి సరిపడా ఉప్పు, కరివేపాకు వేసి మరో మూడు నిమిషాల పాటు బాగా కలుపుతూ ఫ్రై చేయాలి.
అంతే... ఘుమఘుమలాడే వెల్లుల్లి కారం కాకరకాయ సిద్ధం. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని ఈ కాకరకాయ కారం తింటే రుచి అదిరిపోతుంది. చేదు ఇష్టపడని వారికీ ఇది తప్పకుండా నచ్చుతుంది.