Loading...
Bonalu Special Makka Garelu : బోనాల స్పెషల్.. అమ్మవారికి నైవేద్యంగా కరకరలాడే మినప-మక్క గారెలు..
బోనాల స్పెషల్.. అమ్మవారికి నైవేద్యంగా కరకరలాడే మినప-మక్క గారెలు..

Bonalu Special Makka Garelu : బోనాల స్పెషల్.. అమ్మవారికి నైవేద్యంగా కరకరలాడే మినప-మక్క గారెలు..

వ్రాసిన వారు Moogati Shabari
Jul 17, 2026
10:24 am

ఈ వార్తాకథనం ఏంటి

మరికొద్ది రోజుల్లో ఆషాఢ బోనాల సందడి మొదలుకానుంది. ఈ ఏడాది జూన్ 26 నుంచి బోనాల ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ పండుగ సందర్భంగా అమ్మవారికి బోనం సమర్పించడంతో పాటు వివిధ రకాల నైవేద్యాలు కూడా తయారు చేస్తారు. వాటిలో మక్క గారెలు కూడా ఒకటి. అయితే ఈసారి కాస్త వెరైటీగా, మరింత రుచిగా మినప-మక్క గారెలు తయారు చేయాలనుకుంటే ఈ సులభమైన రెసిపీని ట్రై చేయొచ్చు. ఈ వంటకు కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇప్పుడు తెలుసుకుందాం.

వివరాలు

కావాల్సిన పదార్థాలివే..

రెండు స్వీట్ కార్న్‌లు,

ఒక కప్పు మినపప్పు,

అర కప్పు ఉప్మా రవ్వ,

మూడు పచ్చిమిర్చీలు,

ఒక అంగుళం అల్లం ముక్క,

అర కప్పు కొత్తిమీర తురుము,

ఒక టీస్పూన్ వంట సోడా,

రుచికి సరిపడా ఉప్పు,

డీప్ ఫ్రైకి సరిపడా నూనె.

వివరాలు

తయారీ విధానం ఇదే..

ముందుగా మినపప్పును రాత్రంతా లేదా కనీసం మూడు గంటల పాటు నానబెట్టాలి.

తర్వాత నీరు ఎక్కువగా వేయకుండా మిక్సీలో గట్టిగా పిండిలా రుబ్బుకోవాలి.

అవసరమైతే మాత్రమే కొద్దిగా నీరు చిలకరించాలి. ఈ పిండిని పక్కన పెట్టాలి.

ఆ తర్వాత స్వీట్ కార్న్ గింజలను మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.

ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో మినప పిండి, స్వీట్ కార్న్ పేస్ట్ వేసి బాగా కలపాలి.

స్వీట్ కార్న్ నుంచి తేమ ఎక్కువగా వస్తుంది కాబట్టి అందులో ఉప్మా రవ్వ వేయాలి.

ఉప్మా రవ్వ లేకపోతే బియ్యం పిండిని కూడా ఉపయోగించవచ్చు.

పిండి పలుచగా ఉంటే అవసరాన్ని బట్టి ఉప్మా రవ్వ లేదా బియ్యం పిండి పరిమాణాన్ని సర్దుబాటు చేసుకోవాలి.

ADVERTISEMENT

వివరాలు

సులభంగా గారెలు తయారు చేసుకోండిలా..

తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కొత్తిమీర తురుము, ఉప్పు, వంట సోడా వేసి అన్ని పదార్థాలు బాగా కలిసేలా పిండిని కలపాలి.

ఇప్పుడు స్టౌపై కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేయాలి.

నూనె బాగా వేడెక్కిన తర్వాత మంటను మీడియం స్థాయికి తగ్గించి, పిండిని గారెల ఆకారంలో చేసి నూనెలో వేయాలి.

రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చే వరకు వేయించి తీసేయాలి.

ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా గారెలు తయారు చేసుకోవాలి.

ADVERTISEMENT

వివరాలు

ఈ బోనాలకు తప్పకుండా ట్రై చేయండిలా..

అంతే.. బయట కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉండే రుచికరమైన మినప-మక్క గారెలు సిద్ధం.

వీటిని బోనాల సందర్భంగా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడమే కాకుండా, ఇంట్లో ఎప్పుడైనా స్నాక్‌గా కూడా తయారు చేసుకోవచ్చు.

ఎక్కువసేపు కరకరలాడుతూ రుచిని నిలబెట్టుకునే ఈ వెరైటీ గారెలను ఈ బోనాలకు తప్పకుండా ట్రై చేసి కుటుంబ సభ్యులకు వడ్డించండి.

ADVERTISEMENT