Page Loader
 Motivational : తండ్రి తలచుకోవాల్సిన చాణక్య నీతి.. కుమార్తె విషయంలో ఈ తప్పులు చేయకూడదు?
తండ్రి తలచుకోవాల్సిన చాణక్య నీతి.. కుమార్తె విషయంలో ఈ తప్పులు చేయకూడదు?

 Motivational : తండ్రి తలచుకోవాల్సిన చాణక్య నీతి.. కుమార్తె విషయంలో ఈ తప్పులు చేయకూడదు?

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 30, 2025
12:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

చాణక్యుడు ఓ రాజకీయ, ఆర్థిక విధానవేత్త మాత్రమే కాదు. జీవితంలోని ప్రతి కోణాన్ని లోతుగా అధ్యయనం చేసిన తత్త్వవేత్త. ఆయన రచించిన చాణక్య నీతి నేటికీ వ్యక్తిగత జీవితం నుంచి కుటుంబ సంబంధాల వరకూ మార్గదర్శకంగా నిలుస్తోంది. ఇందులో భాగంగా తండ్రి-కుమార్తె మధ్య ఉన్న పవిత్ర బంధానికి సంబంధించి కొన్ని విలువైన పాఠాలను చాణక్యుడు తెలియజేశాడు. ఆ బంధం జీవనాంతం మధురంగా ఉండాలంటే తండ్రులు అనుసరించాల్సిన కొన్ని నియమాలు ఇవే:

Details

1. అత్యధిక జోక్యం వద్దు - స్వేచ్ఛకు మార్గం ఇవ్వండి 

చాణక్యుని దృష్టిలో ప్రతీ మనిషికి, తద్వారా ప్రతీ కుమార్తెకి తన జీవితంపై నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఉండాలి. వివాహం, చదువు, కెరీర్ వంటి కీలక విషయాల్లో తండ్రి తన అభిప్రాయాన్ని చెప్పాలి గానీ, ఆమె అభిప్రాయాన్ని పట్టించుకోకుండా నిర్ణయాలు తీసుకోవడం సరికాదు. నిర్ణయాలు తీసుకునే సమయంలో తప్పు-సరిని వివరించి, ఎంపిక ఆమె చేతే జరిగేలా తండ్రి ప్రోత్సహించాలన్నది చాణక్యుని హితవు.

Details

2. కొడుకు-కూతురు మధ్య తేడాలు చూపొద్దు 

చాణక్యుని నీతి ప్రకారం పిల్లలిద్దరినీ సమానంగా చూసే తండ్రే నిజమైన గొప్పవాడు. కొడుకుకు ఇచ్చే ప్రేమ, గౌరవం, హక్కులను కూతురికీ ఇవ్వాలి. ఒక్క కూతురు అని తగ్గించడం వలన ఆమెలో న్యూనతా భావం కలుగుతుంది. ఆ భావం ఆమె భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది.

Details

3. భద్రతపై అప్రమత్తంగా ఉండాలి 

తండ్రి బాధ్యత కూతురిని రక్షించడమేనని చాణక్యుది స్పష్టమైన సందేశం. ఇంట్లోనూ, బయటనూ సురక్షిత వాతావరణం కల్పించడంతో పాటు, ఆత్మరక్షణ పాఠాలు నేర్పించాలి. ఆమె స్నేహితులు, దినచర్య గురించి తగిన అవగాహన తండ్రికి ఉండాలి. తండ్రి తన కుమార్తెకు భద్రత కల్పిస్తూ, స్వేచ్ఛను దూరం చేయకుండా సమతూకంతో మేనేజ్‌ చేయాలి.

Details

4. చదువులో నిర్లక్ష్యం వద్దు 

చాణక్యుడు విద్యను అత్యంత ముఖ్యంగా పరిగణించాడు. చదువుకున్న కూతురు కుటుంబాన్ని, సమాజాన్ని వెలుగులోకి తీసుకురాగలదని నమ్మాడు. కాబట్టి తండ్రి తన కుమార్తె విద్యలోనూ పూర్తిస్థాయిలో మద్దతు ఇవ్వాలి. ఆమె ఆసక్తులు ఏవైనా కావచ్చు, వాటిని గుర్తించి, అభివృద్ధి చెందే అవకాశాలు కల్పించాలి.

Details

5. భావోద్వేగ మద్దతు అత్యవసరం 

ఆర్థిక, శారీరక భద్రతలకే పరిమితం కాకుండా, తండ్రి తన కుమార్తెకు భావోద్వేగంగా అండగా ఉండాలి. ఆమె భావాలను వినాలి, అర్థం చేసుకోవాలి. ఎటువంటి పరిస్థితుల్లోనైనా తన పక్కన తండ్రి ఉన్నాడనే నమ్మకం కూతురిని మెంటల్ గాను, ఎమోషనల్‌గా గాను బలంగా తయారు చేస్తుంది. అది ఆమెను ఏ సమస్యను అయినా ధైర్యంగా ఎదుర్కొనే వ్యక్తిగా తీర్చిదిద్దుతుంది. ఆచార్య చాణక్యుడి నీతులన్నీ నేటి తండ్రులకు కూడా చక్కటి మార్గదర్శకాలు. కుమార్తెను ప్రేమతో, విశ్వాసంతో, సమానతతో తీర్చిదిద్దగలిగితే... ఆమె జీవితం మాత్రమే కాదు, సమాజమంతా మెరుగవుతుంది.