
Holi Celebrations: పిల్లలతో సురక్షితంగా హోలీ ఆడటం ఎలాగో తెలుసా.. కొన్ని చిట్కాలు మీ కోసం
ఈ వార్తాకథనం ఏంటి
హోలీ పండుగ దగ్గరలోనే ఉంది. ఈ రంగుల పండుగ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రంగుల పండుగ హోలీ మనం దేశమంతటా జరుపుకుంటారు.
అన్ని వయసుల వారు ఒకరినొకరు కలుసుకుంటారు. నీరు, రంగులను ఒకరినొకరు పూసుకుంటూ సరదాగా గడుపుతారు.
అయితే ఇలాంటి పరిస్థితుల్లో కచ్చితంగా మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
ముఖ్యంగా చిన్న పిల్లలు ఉన్నవారు మరింత జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న పిల్లల చర్మం చాలా సున్నితంగా ఉంటుంది, అలాగే వారి శ్వాసకోశ వ్యవస్థ కూడా చాలా సున్నితంగా ఉంటుంది.
జాగ్రత్తలు తీసుకోకపోతే, హోలీ రంగులలో ఉండే రసాయనాలు,రంగులు వారి ఆరోగ్యంపై చాలా చెడు ప్రభావాన్ని చూపుతాయి.
చిన్న పిల్లలతో సురక్షితంగా హోలీని ఎలా జరుపుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Details
వాటర్ గన్స్:
హొలీ పండుగ సంతోషంగా జరుపుకోవడానికి వాటర్ గన్స్ ముఖ్యపాత్రను పోషిస్తాయి.ఈ వాటర్ గన్స్ తో ఒకరిపై ఒకరు రంగులను జల్లుకుంటూ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. అయితే.. వాటర్ గన్ ను ఉపయోగించి ముఖం, చెవులు లేదా నోటిపై రంగులు చల్లడం ప్రమాదకరం కాబట్టి.. పిల్లలకు ఈ విషయం అర్థం చేసుకునే విధంగా చెప్పాలి.
సహజ రంగుల వినియోగం:సింథటిక్ రంగుల వల్ల చర్మంపై దద్దుర్లు, అలెర్జీలు వస్తాయి. స్కిన్-ఫ్రెండ్లీ ఆర్గానిక్ హోలీ రంగులు మృదువుగా ఉంటాయి. అంతేకాదు సహజ రంగులైతే ఈజీగా తొలగించుకోవచ్చు. గులాబీ, బంతి పువ్వులు, గంధపు చెక్క, గోరింట, పసుపు వంటి వాటి నుంచి తయారు చేసే సహజ రంగులు శ్రేష్టమైనవి.
Details
పిల్లలకు ఇలా హోలీ డ్రెస్ సిద్ధం చేయండి:
పిల్లలు సింథటిక్ రంగులతో ఆడుకునే సమయంలో హానికరం కాకుండా.. వాటి ప్రభావాన్ని తగ్గించడానికి పిల్లలకు కాళ్లకు సాక్స్, చేతులకు గ్లౌజ్ సహా శరీరం అంతా కప్పే విధంగా దుస్తులను ధరింపజేయండి. అలాగే రసాయనాల రంగుల నుంచి వారి కళ్లకు రక్షణ కోసం సురక్షితంగా ఉండే గాగుల్స్ లేదా సన్ గ్లాసెస్ ధరింపజేయండి.
హోలీ తర్వాత, మీ పిల్లలకు శుభ్రమైన నీటితో స్నానం చేయండి.పిల్లల చర్మం చల్లబరచడానికి బేబీ లోషన్‌ను రాయండి.
మీరు ఏవైనా అసాధారణ లక్షణాలను గమనించినట్లయితే, వెంటనే వైద్యుడిని సంప్రదించండి.