Children's Day 2024: ఇతర దేశాలలో బాలల దినోత్సవం జరుపుకునే తేదీలివే!
భగవంతుడు ప్రత్యక్షమై, నీకు ఏదైనా వరం ఇవ్వాలని అడిగితే, మనలో చాలామంది తమ బాల్యాన్ని తిరిగి ఇవ్వమని కోరతారు. బాల్యం అనేది భగవంతుడు ఇచ్చిన గొప్ప వరంగా భావించబడుతుంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు బాలల దినోత్సవాన్ని జరుపుకుంటుంటాయి. భారతదేశంలో ప్రతి సంవత్సరం నవంబర్ 14న 'బాలల దినోత్సవం' జరుపుకుంటారు. ఈ రోజు చాచా నెహ్రూ జయంతి సందర్భంగా నిర్వహించబడుతుంది. ఆ మహనీయుడికి నివాళులు అర్పిస్తూ, దేశ వ్యాప్తంగా పిల్లలకు శుభాకాంక్షలు తెలియజేస్తారు.
భారతదేశంలో అక్టోబరులో బాలల దినోత్సవం..
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మొదటి ప్రధానిగా పనిచేసిన వ్యక్తి జవహర్ లాల్ నెహ్రూ. ఆయన పిల్లలను జాతి సంపదగా భావించేవారు. బాలల అభివృద్ధికి ఆయన చేసిన కృషి అమోఘం. అందుకే ఆయన పుట్టినరోజున బాలల పండుగ నిర్వహించడం ఆనవాయితీ అయింది. ఈ రోజు పిల్లల కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ, చాచా నెహ్రూను స్మరిస్తారు. 1954కి ముందు, భారతదేశంలో అక్టోబరులో బాలల దినోత్సవం జరుపుకునేవారు. ఐక్యరాజ్య సమితి నిర్ణయాల ప్రకారం, 1954లోనే ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజును మొదటిసారిగా నిర్వహించారు. నవంబర్ 14న, ఐరాస పిల్లల హక్కుల కోసం ఒక బిల్లును ఆమోదించింది. ప్రపంచవ్యాప్తంగా పిల్లల సంక్షేమం కోసం వివిధ చర్యలు తీసుకోవడం ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశం.
ఆరోగ్యకరమైన బాల్యాన్ని అందించే ప్రాధాన్యత
బాలల దినోత్సవం చిన్నారులకు సురక్షితమైన, ఆరోగ్యకరమైన బాల్యాన్ని అందించే ప్రాధాన్యతను నొక్కిచెబుతుంది. పిల్లల హక్కులను కాపాడటం, వారి విద్య, ఆరోగ్యం, సురక్షిత వాతావరణం, పోషకాహారం వంటి అంశాల్లో అవగాహన పెంచడం ఈ దినోత్సవ లక్ష్యం. చైనాలో జూన్ 1న, పాకిస్తాన్‌లో నవంబర్ 20న, జపాన్‌లో మే 5న, దక్షిణ కొరియాలో మే 5న, పోలాండ్ లో జూన్ 1న, శ్రీలంకలో అక్టోబర్ 1న ఇలా వివిధ దేశాలలో బాలల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. ఈ దినోత్సవం చిన్నారులకు సురక్షితమైన, ఆరోగ్యకరమైన బాల్యాన్ని అందించడంలో ఉన్న ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. చిన్నారుల హక్కులను పరిరక్షించడం,వారికి విద్య,శ్రేయస్సు కోసం శ్రమించడం,పోషకాహారాన్ని అందించడం,ఇంట్లో సురక్షిత వాతావరణాన్ని కల్పించడం వంటి బాధ్యతలను గుర్తుచేస్తుంది.
బాలల దినోత్సవం ప్రాధాన్యత
పేదరికం,నిరక్షరాస్యత, ఆరోగ్య సంరక్షణ లోపం, బాల కార్మికత్వం వంటి సమస్యలపై అవగాహన పెంపొందిస్తుంది. బాలల హక్కులను పెంపొందించాలి. పిల్లల విద్యను ప్రోత్సహించాలి. పిల్లల అభిప్రాయాలకు విలువ ఇవ్వాలి. పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలి. విద్యతోపాటు ఆటలు, వినోదంలో అవగాహన కల్పించాలి. పిల్లల సృజనాత్మకతను ప్రోత్సహించాలి.