క్రిస్మస్ కి సరిపోయే సరికొత్త ఫ్యాషన్.. మీ దగ్గర ఉన్నాయేమో చెక్ చేసుకోండి
ఈ వార్తాకథనం ఏంటి
పండగ పూట కొత్త బట్టలు తొడుక్కుంటే అదోరకం అనుభూతి. ఆ అనుభూతి మిగలాలంటే మీ దగ్గర క్రిస్మస్ కి సరిపోయే ఫ్యాషన్ బట్టలు ఉండాల్సిందే. ఐతే సరికొత్త ఫ్యాషన్ పేరుతో మీకు నప్పని బట్టలు వేసుకుని నిరాశకు గురి కావద్దు.
ఎలాంటి వారికైనా, ఏ కాలానికైనా ఫ్యాషన్ గా నిలిచే బట్టలను ధరించండి. ప్రస్తుతం క్రిస్మస్ రోజున ఏ బట్టలు వేసుకుంటే ఆహ్లాదంగా అనిపిస్తుందో తెలుసుకుందాం.
ఎరుపు లేదా ఆకుపచ్చ: క్రిస్మస్ రోజు ఎరుపు లేదా ఆకుపచ్చ రంగుల్లో ఉన్న బట్టలను ధరించండి. ఈ రెండు రంగులు పండగ పార్టీకి సరిగ్గా సరిపోతాయి.
ఈ రంగుల్లో మీకు డ్రెస్సెస్ దొరక్కపోతే ఇవి రెండూ మిక్స్ ఉన్న బట్టలైనా బాగుంటాయి.
క్రిస్మస్ ఫ్యాషన్
కాలలు మారినా కొత్తగా కనిపించే ఫ్యాషన్
చెక్ షర్ట్స్: చెక్ షర్ట్స్, ప్యాంట్స్ కూడా పండక్కి బాగుంటాయి. ఆడా, మగా ఎవ్వరైనా సరే చెక్ షర్ట్స్ వేసుకుని రెడీ ఐతే బాగుంటుంది. అమ్మాయిలకైతే ఈ రకం బట్టల్లో చాలా వెరైటీలు ఉంటాయి.
ఛమ్కీ: ఛమ్కీల బట్టలు ఎవర్ గ్రీన్ ఫ్యాషన్. అమ్మాయిలకు ఈ రకం డ్రెస్సులు అందంగా ఉంటాయి. స్కర్ట్, ప్యాంట్, టాప్స్ ఏవైనా సరే నలుపు, సిల్వర్ రంగుల్లో బాగుంటాయి.
స్కార్ఫ్: ఇది అదనపు ఆకర్షణగా నిలుస్తుంది. ఎప్పుడూ స్కార్ఫ్ వేసుకునే అలవాటు లేని వారు కూడా పండగ రోజున దీన్ని వేసుకోవచ్చు.
సో మరి ఇంకెందుకు ఆలస్యం. మీకు ఏ రకమైన బట్టలు నప్పుతాయో ఇప్పటి నుండే ట్రయల్స్ మొదలెట్టండి. పండగరోజు సరికొత్త ఫ్యాషన్ తో మెరిసిపోండి.